మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు ఆర్డీఓ ఎస్ఎస్ కె.ఖాజావలి నగరంలో 50వ సచివాలయం, నారాయణ పురంలో అర్బన్ హెల్త్ సెంటర్ సందర్శించారు. తొలుత 50వ సచివాలయం సందర్శించిన ఆర్టీఓ సచివాలయం లో వివిధ పథకాల సమాచారం, లబ్దిదారుల వివరాలతో డిస్ ప్లే బోర్డులు పరిశీలించారు. సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ హాజరు పరిశీలించి సచివాలయ పరిధిలో ఫీవర్ సర్వే, కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాలు అమలు తీరుపై ఆరా తీశారు. సంబంధిత రికార్డులు పరిశీలించారు. జగనన్న శాశ్వత గృహహక్కు పథకం క్రింద ఇళ్ల పట్టాలు …
Read More »Latest News
బందరు మండలంలో పాడైన రోడ్ల మరమ్మత్తులకు చర్యలు చేపడతాం… : మంత్రి పేర్ని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు మండలంలో దెబ్బతిన్న రోడ్లన్నింటికి మరమ్మత్తులు చేపట్టి అభివృద్ధికి చర్యలు చేపడతామని రాష్ట్ర రవాణా సమాచార శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. శుక్రవారం మంత్రి కార్యాలయం వద్దకు నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల నుండి వివిధ సమస్యలతో వచ్చిన ప్రజానీకాన్ని మంత్రి కలసి వారి సమస్యలు అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. బందరు మండలం భోగిరెడ్డిపల్లి గ్రామంలో సమస్యలు సర్పంచ్ గరికిపాటి శ్రీరాములు గ్రామస్థులతో కలసి మంత్రికి వివరించారు. గ్రామంలో గౌడపాలెం సెంటరు నుండి …
Read More »పర్యాటక ప్రాంతాల అభివృద్ది పనులను వేగవంతం చేయాలి…
-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ది, మౌలిక వసతుల కల్పన పనులను వేగంవంతం చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తం శెట్జి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం అమరావతి సచివాలయంలోని తమ ఛాంబరులో పర్యాటక, క్రీడా శాఖల అధికారులతో మంత్రి సమావేశమై శాఖల వారీగా నిర్వహిస్తున్న పనుల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్దికై పెట్టుబడుల ఆకర్షణ, నిధుల …
Read More »శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానంలో బాలాత్రిపురసుందరిదేవిని దర్శించుకున్న పోతిన వెంకట మహేష్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చిట్టినగర్ లో వెలసిన శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానంలో బాలాత్రిపురసుందరిదేవి రూపంలో అమ్మవారిని జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ జనసేన పార్టీ నాయకులతో కలిసి దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పాలకమండలి ప్రెసిడెంట్ లింగిపిల్ల.అప్పారావు, సెక్రటరీ మరుపిల్ల.హనుమంతరావు మరియు కోశాధికారి పిళ్ళ.శ్రీనివాస్ మరియు కమిటీ సభ్యులు మహేష్ ని ఆలయ మర్యాదలతో …
Read More »పాదయాత్ర లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే దిశగా జగన్ మోహనరెడ్డి ప్రభుత్వం కృషి…
-మహిళల సంక్షేమo, స్వావలంబన, సాధికారతే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకములు అమలు -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “ వై.ఎస్.ఆర్ ఆసరా“ 2వ విడత కార్యక్రమములో భాగంగా శుక్రవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 20, 21 మరియు 23వ డివిజన్లకు సంబందించి కృష్ణలంక వాసవి కళ్యాణ మండపం నందు జరిగిన కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ …
Read More »దసరా ఉత్సవలలో విధులు నిర్వహించు సచివాలయం సిబ్బంది భాద్యత వ్యవహరించాలి… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దసరా ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి నగరానికి వచ్చు భక్తులు / యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచుతూ, ప్రతి ఒక్కరు విధిగా కోవిడ్ నియమాలు పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం నందు దసరా ఉత్సవాలలో విధులు నిర్వహిస్తున్న వార్డ్ హెల్త్ సెక్రటరీ, వార్డ్ శానిటేషన్ సెక్రటరీ, వార్డ్ ఎడ్మిన్ సెక్రటరీ, వార్డ్ వాలెంటర్సీ …
Read More »ఉద్యోగుల విధి నిర్వహణలో కనీసం ప్రాధమిక బాధ్యత ఉండాలి…
-మీమీ బాధ్యతలు, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం తగదు.. -లే అవుట్ లలో అంతర్గత రహదారుల, లేవిలింగ్ పనులు వేగవంతం చెయ్యాలి -పెరవలి హౌసింగ్ ఏ ఈ అభినందించ తగ్గ పనితీరు చూపుతున్నారు.. -కలెక్టర్ కార్తికేయ మిశ్రా కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఇళ్ల నిర్మాణం కోసం రెండోవ దశ లేవిలింగ్ పనులు ఎన్ని ఉన్నాయి తెలుసుకుని ఆయా పనులు వేగవంతం చెయ్యాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ రెవెన్యూ ప్రత్యక్ష పర్యవేక్షణ చెయ్యాల్సి ఉందని …
Read More »మన ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం…
తాళ్లపూడి (గజ్జరం), నేటి పత్రిక ప్రజావార్త : మన ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వమని, ఇచ్చిన హామీ లను అమలు చేయడం తో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్ లు అన్నారు. స్థానికంగా నగజ్జరం గ్రామంలో జరిగిన వైఎస్సార్ ఆసరా రెండో విడత, రహదారి శంఖుస్థాపన కార్యక్రమం లో మంత్రి, పార్లమెంట్ సభ్యులు ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్త్రీ శిశు …
Read More »మహిళలు సంతోషంగా మీ కుటుంబాల కు ఆధారంగా ఉండాలి…
తాళ్లపూడి (అన్నదేవరపేట), నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు సంతోషంగా మీ కుటుంబాల కు ఆధారంగా ఉండాలని, మహిళా సాధికారత దిశగా అడుగులు వెయ్యలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయమని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక అన్నదేవరపేట గ్రామంలో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా రెండో విడత సంబరాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ …
Read More »కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి గా ఎస్. మల్లిబాబు…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి గా ఎస్. మల్లిబాబు శుక్రవారం భాద్యత లను స్వీకరించారు. శుక్రవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న ఎస్. మల్లిబాబు కి కార్యాలయ పరిపాలనా ధికారి జి. ఎస్. ఎస్.జవహర్ బాజీ, ఇతర సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఎస్ మల్లిబాబు మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. డివిజన్ స్థాయిలో అందరిని కలుపుకుని వెళతానని, ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు అమలు చర్యలు తీసుకుంటామని తెలిపారు. …
Read More »