Breaking News

కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి గా ఎస్. మల్లిబాబు…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి గా ఎస్. మల్లిబాబు శుక్రవారం భాద్యత లను స్వీకరించారు. శుక్రవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న ఎస్. మల్లిబాబు కి కార్యాలయ పరిపాలనా ధికారి జి. ఎస్. ఎస్.జవహర్ బాజీ, ఇతర సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఎస్ మల్లిబాబు మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. డివిజన్ స్థాయిలో అందరిని కలుపుకుని వెళతానని, ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు అమలు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటి వరకు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఆర్డీవో గా పనిచేస్తూ, కొవ్వూరుకి బదిలీపై రావడం జరిగిందని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంటింటా నెట్‌జీరో… ఆదర్శ గ్రామాలే లక్ష్యం

-ఇంటి నుంచే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం -అలవరం కోడూరులో నెట్‌జీరో విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు మాడుగుల, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *