విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఆర్థిక పరిస్థితులు కారణముగా వైద్యానికి దూరం కాకూడదు అనేదే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు.శనివారం నాడు గుణదల నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అవినాష్ పాల్గొని 3,12,14,18 డివిజన్ లకు చెందిన 5 గురికి వైద్య సేవలు నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు …
Read More »Telangana
జిల్లాలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు… : కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) శనివారం జారీచేసిన షెడ్యూల్ ప్రకారం 2024 సాధారణ ఎన్నికల 4వ దశలో జిల్లాలోని విజయవాడ పార్లమెంటు, ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు మే 13వ తేదీన పోలింగ్, జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరుగుతాయని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు శనివారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈసీఐ ప్రకటించిన సాధారణ ఎన్నికల-2024 షెడ్యూల్‌కు అనుగుణంగా జిల్లాలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని …
Read More »జిల్లాలో మే 13న సాధారణ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఈసీఐ
– జిల్లాలో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు – జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త సార్వత్రిక ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్‌ను విడుదల చేసిన నేపథ్యంలో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లోకి వచ్చిందని.. ఇందుకు సంబంధించి జిల్లాలో ఈసీఐ మార్గదర్శకాలను పటిష్టంగా అమలుచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అమలుకు సంబంధించి అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల …
Read More »అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిది
– జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం చాలా గొప్పదని, మరువలేనిదని జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్ అన్నారు. శనివారం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాముల …
Read More »భగవత్సేవతో అంతులేని తృప్తి
-నిత్యాన్నదాన సేవ లో పాల్గొనటం పూర్వ జన్మ సుకృతం -ఉడతా భక్తి సాయం -డాక్టర్ ఎస్వీ రంగారావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంతో ఉత్కృష్టమైన మానవ జన్మలో భగవంతునికి సేవ చేసుకునే మహద్భాగ్యం దక్కటం కూడా భగవంతుని ఆజ్ఞగా భావిస్తున్నామని నిత్యాన్న దాన సేవలోవ పాలు పంచుకునే అవకాశం పూర్వ జన్మ సుకృతం మని ప్రముఖ వైద్యులు ఎస్వీ రంగారావు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి దాతల సహకారంతో ఉడతా భక్తి సాయంగా మరడ నాగేంద్ర …
Read More »అచార్య యార్లగడ్డకు డిల్లీ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం
-డాక్టర్ ఎన్విఎల్ నాగరాజు స్మారక అవార్డును అందుకోనున్న వైఎల్పి -ముఖ్య అతిధిగా హాజరుకానున్న మిజోరాం గవర్నర్ కంభంపాటి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బహుబాషా కోవిదుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, మాజీ రాజ్య సభ్యులు అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. తెలుగు భాషా వికాసానికి గత మూడు దశాబ్దాలకు పైగా ఎనలేని కృషి చేస్తున్న డిల్లీ తెలుగు అకాడమీ, గ్లోబల్ తెలుగు అకాడమీ సంయిక్తంగా యార్లగడ్డకు ఉగాది పురస్కారం ప్రకటించాయి. సంస్ద 35వ వార్షిక సాంస్కృతిక, …
Read More »ఎలక్ట్రానిక్ వాచీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదు
-ఏపీపీఎస్సీ గ్రూప్- 1 పరీక్ష నిర్వహణ కు ఏర్పాట్లు పూర్తి: జిల్లా రెవెన్యూ అధికారి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 17తేదీన (నేడు) నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్- 1 పరీక్ష కోసం ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయడం జరిగిందని పరీక్ష నిర్వహణకు సిసి కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని, ఎలక్ట్రానిక్ వాచీలు, గ్యాడ్జెట్స్ అనుమతి లేదని జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రూప్ -1 పరీక్షలు ఉ. 10:00 గంటల నుంచి మ. 12:00 …
Read More »రానున్న సార్వత్రిక ఎన్నికల సన్నద్ధత, తదితర పలు అంశాలపై సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేసిన రాష్ట్ర సిఎస్ డా. కే.ఎస్ జవహర్ రెడ్డి
-సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుంది: సిఈఓ ముఖేష్ కుమార్ మీనా తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నుండి శనివారం గ్రూప్- 1 పరీక్షలకు సంబంధించిన సూచనలు, మోడల్ కోడ్ ఆఫ్ కండెక్ట్ పై సూచనలు, పట్టా, డికెటి మరియు ప్రభుత్వ భూములకు సంబంధించి భూ సేకరణ & ఆర్&ఆర్ సమస్యలు, పీ&ఆర్డీ, ఎన్ఆర్ఈజిఎ – కరువు మండలాల్లో వేజ్ జనరేషన్, తాగునీరు, ఆరోగ్యం, వైద్యం & కుటుంబ సంక్షేమం, జనన & మరణ …
Read More »తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ధ్యానచంద్ర హెచ్.ఎం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గా నేటి శనివారం ధ్యానచంద్ర హెచ్.ఎం జిల్లా కలెక్టరేట్ నందు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఎస్డిసి భాస్కర్ నాయుడు, ఆర్డీఓ సూళ్లూరుపేట చంద్రముని పలువురు జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఎ.ఓ నరసింహ రావు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు నూతన జెసి కి శుభాకాంక్షలు తెలిపారు.
Read More »అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం ఆదర్శనీయం: పెంచల కిషోర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరజీవి పొట్టి శ్రీరాములు వారి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం అని తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ అన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్ నందు అమరజీవి పొట్టి శ్రీరాములు వారి జయంతిని పురస్కరించుకొని బీసీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డి.ఆర్.ఓ హాజరై పొట్టి శ్రీరాములు గారి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగఫలమే మన …
Read More »
Prajavartha Online Telugu News