Breaking News

Telangana

ఈ నెల 18వ తేదీ (సోమవారం) నిర్వహించే స్పందన కార్యక్రమం రద్దు…

-జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సాధారణ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ఈ నెల 18వ తేదీ (సోమవారం)న స్పందన కార్యక్రమం రద్దు చేయటం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం జిల్లా, డివిజన్, మండల స్థాయిలో నిర్వహించే స్పందన కార్యక్రమం రద్దుచేసినట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని …

Read More »

జిల్లాలో ప్ర‌శాంతంగా ముగిసిన గ్రూప్‌-1 స్క్రీనింగ్ ప‌రీక్ష‌

-పేప‌ర్‌-1కు 63.06 శాతం, పేప‌ర్‌-2కు 62.66 శాతం హాజ‌రు -జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఆదివారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ)- గ్రూప్‌-1 స్క్రీనింగ్ ప‌రీక్ష ప్ర‌శాంతంగా ముగిసిన‌ట్లు క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. విజ‌య‌వాడ‌లో 24 కేంద్రాల్లో 10,526 మంది అభ్య‌ర్థుల‌కు ప‌రీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేయ‌గా.. ఉద‌యం జ‌రిగిన పేప‌ర్‌-1కు 63.06 శాతం (6,638), మ‌ధ్యాహ్నం జ‌రిగిన పేప‌ర్‌-2కు 62.66 శాతం (6,596) మంది హాజ‌రైన‌ట్లు వెల్ల‌డించారు. ప‌రీక్ష‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డంలో …

Read More »

ఇఫ్తార్ విందులో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష లో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు, ఆత్మీయత మతసామరస్యానికి ప్రతీక అని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. ఆదివారం 22వ డివిజన్,మజీద్ -ఏ-కౌసర్ నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ముస్లిం సోదరులు రంజాన్ మాసం అంతా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారని, పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులు …

Read More »

తూర్పు నియోజకవర్గ ఉత్తరాంద్ర కాపు నాయకులతో ఆత్మీయ సమ్మేళనం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక తూర్పు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ అబ్యర్ది దేవినేని అవినాష్ తెలిపారు. ఆదివారం 14వ డివిజన్, రజకులు కళ్యణ మండపం వద్ద జరిగిన ఉత్తరాంద్ర తూర్పు కాపు నాయకులతో ఆత్మీయ సమావేశంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని తూర్పు కాపు సంక్షేమం కోసం …

Read More »

తూర్పు నియోజకవర్గ ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో తూర్పు నియోజకవర్గ ఆర్యవైశ్య కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఆదివారం విజయవాడ నక్షత్ర కన్వెన్షన్ నందు జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, ఎమ్ ఎల్ సి రుహుల్లా హాజరయ్యారు. ఈ సందర్బముగా ముఖ్య అతిథులు, వక్తలు మాట్లాడుతూ  వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వారి సంక్షేమం కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలు …

Read More »

దేవునితో ఒక్కరోజు కూడిక

-సహాయ మాత దేవాలయం నందు ఒక్క రోజు ఉపవాస ప్రార్థనలు ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక ఇబ్రహీంపట్నం సహాయ మాత దేవాలయం నందు విచారణ గురువు అనిల్ ఎం ఎస్ ఎఫ్ ఎస్ చే దేవాలయము నందు ఆదివారము ఉదయం తొమ్మిది గంటల నుండి ఒక్కరోజు ప్రభువుతో ఉపవాస కూడికలను నిర్వహించారు. హైదరాబాద్ చెందిన విసి గురువు జైసన్ చే విశ్వాసంతో కూడిన ప్రభు తో ఒక్కరోజు కూడికను నడిపించారు. ఉదయం 9 గంటల నుండి వాక్య సందేశాన్ని ప్రజలకు అందించారు. …

Read More »

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున స్పందన కార్యక్రమం రద్దు…

-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఈనెల 18వ తేదీ సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున స్పందన కార్యక్రమమును రద్దు చేస్తున్నట్లు తెలిపారు. భారతీయ ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో, ఎన్నికల ప్రవర్తన నియమావళి ( మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమలులో ఉన్నందున ప్రతి సోమవారం కార్పొరేషన్ లో, జోనల్ …

Read More »

నగరపాలక సంస్థ ఎన్నికల విభాగాన్ని ఆకస్మిక తనిఖీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల విధుల్లో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్ఓ) కీర్తి చేకూరి స్పష్టం చేశారు. ఆదివారం నగరపాలక సంస్థ ఎన్నికల విభాగాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన సమయంలో విధుల్లో లేని సూపరిండెంట్ పద్మకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని మేనేజర్ ని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శనివారం నుండి ఎన్నికల కోడ్ వచ్చినందున ఎన్నికల విధుల్లో ఎంతో అప్రమత్తంగా ఉండాలని, విధులు కేటాయించబడిన …

Read More »

రాజకీయ పార్టీల పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు తొలగింపు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసిసి) శనివారం నుండే అమలులో ఉన్నందున నగరంలో రాజకీయ పార్టీల పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు తొలగిస్తున్నామని, ఇంకా ఏమైనా ఎంసిసికి సంబందించి ఫిర్యాదులు ఉంటే జిఎంసిలో ఏర్పాటు చేసిన కంప్లైంట్ సెల్ 98499 08391 నంబర్ కి కాల్ చేయడం లేదా వాట్స్ అప్ చేయవచ్చని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్ఓ) కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ …

Read More »

తెలుగు, హిందీ భాష అభివృద్దిలో అచార్య యార్లగడ్డ సేవలు అజరామరం

-మిజోరాం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు -ఘనంగా డిల్లీ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారాల వేడుక -డాక్టర్ ఎన్విఎల్ నాగరాజు స్మారక అవార్డు అందుకున్న వైఎల్పి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు, హిందీ భాషల అభివృద్ది అచార్ల యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ అందిస్తున్న సేవలు ఎంచదగినవని మిజోరాం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు. బహుబాషా కోవిదుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, మాజీ రాజ్య సభ్యులు అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ను ఆదివారం డిల్లీ తెలుగు అకాడమీ ఉగాది పురస్కార …

Read More »