Breaking News

రాజకీయ పార్టీల పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు తొలగింపు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసిసి) శనివారం నుండే అమలులో ఉన్నందున నగరంలో రాజకీయ పార్టీల పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు తొలగిస్తున్నామని, ఇంకా ఏమైనా ఎంసిసికి సంబందించి ఫిర్యాదులు ఉంటే జిఎంసిలో ఏర్పాటు చేసిన కంప్లైంట్ సెల్ 98499 08391 నంబర్ కి కాల్ చేయడం లేదా వాట్స్ అప్ చేయవచ్చని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్ఓ) కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల కోడ్ మేరకు నగరంలోని ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలను నగరపాలక సిబ్బంది తొలగిస్తున్నారని, బహిరంగ ప్రదేశాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే, రోడ్డు వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు, మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయపరమైన అడ్వర్టైజ్మెంట్లు, వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు అన్నింటినీ కూడా శనివారం నుండి తొలగించడం జరుగుతుందని తెలిపారు. నగరంలో ఇంకనూ ఎక్కడైనా ఎంసిసి ఉల్లంఘనలను ప్రజలు గుర్తిస్తే నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కంప్లైంట్ సెల్ కు కాల్ చేసి తెలియచేయడం లేదా వివరాలను వాట్స్ అప్ ద్వారా పంపితే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *