-6వ, 11వ తరగతుల్లో ప్రవేశం కోసం, 7, 8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరణ -సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నడుపబడుతున్న 352 కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) 2024-25 సంవత్సరానికి గాను 6వ, 11వ తరగతుల్లో ప్రవేశం కోసం, 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆన్లైన్లో దరఖాస్తులు తేదీ 12.03.2024 నుండి తేదీ 11.04.2024 వరకు దరఖాస్తులు కోరడమైనది. …
Read More »Telangana
ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.2 లక్షల 50వేల రూపాయల చెక్కు పంపిణీ
-మంత్రి వేణుగోపాలకృష్ణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజల ఆరోగ్య భద్రతకు కొండంత భరోసానిస్తోందని జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ సంక్షేమం, రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. శుక్రవారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద మంజూరైన రూ.2 లక్షల 50 రూపాయల చెక్కును లబ్ధిదారాలైన పాము రామకృష్ణ వారి సతీమని అనంతలక్ష్మి కి మంత్రి వేణుగోపాలకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా …
Read More »ABC-అమరావతి బోటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024 విజయవాడలోని ABC-అమరావతి బోటింగ్ క్లబ్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబీసీ సహ వ్యవస్థాపకురాలు పవిత్ర కాకాని హాజరయ్యారు. మహిళా దినోత్సవంతో పాటు సహ వ్యవస్థాపకురాలు పవిత్ర కాకాని పుట్టినరోజును కూడా ఉద్యోగులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ పవిత్ర కాకాని మహిళా ఉద్యోగులతో పాటు సీనియర్లు, ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను కూడా గుర్తించి సత్కరించారు. వారికి సర్టిఫికెట్లు మరియు మొమెంటోలను పవిత్ర కాకాని …
Read More »అత్యంత భక్తిశ్రద్ధలతో పశ్చాత్తాప పాదయాత్ర
-చేతిలో సిలువను పట్టుకొని క్రీస్తు ప్రభువు అనుభవించిన పాటులను ధ్యానిస్తూ సాగిన పశ్చాత్తాప పాదయాత్ర -పశ్చాత్తాప పాదయాత్ర అనంతరం పలువురు గురువులచే సమిష్టి దివ్యబలి పూజ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇబ్రహీంపట్నం సహాయం మాత దేవాలయ విచారణ గురువు ఫాదర్ అనిల్ , మరియు సహాయక గురువు ఫాదర్ జోసెఫ్ శుక్రవారం పశ్చాత్తాప పాదయాత్ర నిర్వహించారు. ఉదయం 6 గంటలకు సహాయమత దేవాలయం నుండి ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వెంబడి మూలపాడు దేవాలయం వరకు అత్యంత భక్తి శ్రద్ధలతో సాగింది పశ్చాత్తాప …
Read More »ముస్లిం ఐక్యవేదిక రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదు : సయ్యద్ జాఫర్ అలీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తమ నిర్ణయాన్ని చెబుతున్నామని, ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వడం లేదని ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ జాఫర్ అలీ తెలిపారు. శుక్రవారం గాంధీనగర్, ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సయ్యద్ జాఫర్ అలీ మాట్లాడుతూ ముస్లింల సంక్షేమం విషయంలో మరియు ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల కేటాయింపులో నాటి నుండి నేటి వరకు వివిధ రాష్ట్ర ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం …
Read More »అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత రాజమహేంద్రవరం మహిళా కారాగారం నందు జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియ చేశారు. కారాగారంలో ఉన్న మహిళలు ఏ విషయాల గురించి ఆందోళన పడవద్దని, పరివర్తన గృహంలో వారి జీవన శైలిని శాంతి దాయకంగా మార్చుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ వివిధ నైపుణ్యాలను నేర్చుకోవడం వల్ల …
Read More »సెంట్రల్ నియోజకవర్గ ఆడపడుచులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలందరూ గర్వపడేలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ ఆడపడుచులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. మహిళలు లేకపోతే ప్రపంచం నడవదని.. నేటి సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారని మల్లాది విష్ణు …
Read More »అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా విద్యా విధానాలను రూపకల్పన చేయాలి
-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు -ఐబీ బృందాల పరిశీలనలపై విద్యాశాఖ సమీక్ష -ముగిసిన ఐబీ బృందం పర్యటన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఐబీ కరికులాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుసంధానించడంలో పాటించాల్సిన మెలకువలు, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేయడానికి తమ వంతు సహకారం కచ్చితంగా ఉంటుందని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు అన్నారు. ఐబి కరికులం టీం మూడు బృందాలుగా ఏర్పడి పది రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ యాజమాన్య పాఠశాలలను, విద్యా సంస్థలను సందరర్శించిన సంగతి తెలిసిందే. …
Read More »మహిళల రక్షణ… సంక్షేమం మా బాధ్యత…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవతరం యువత తరచూ మల్టీ టాస్కింగ్ అంటూ ఉంటుంది. మన ఇంట్లో అమ్మ, అక్క, చెల్లినే కాదు.. ఏ మహిళామణిని చూసినా మల్టీ టాస్కింగ్ అంటే ఏమిటో తెలుస్తుంది. ఇంటిని చక్కదిద్దుతూ, బిడ్డల ఆలనాపాలన చూస్తూనే- ఉద్యోగ విధుల్లో, తాము ఎంచుకున్న రంగాల్లో రాణిస్తున్న అతివలు ఎందరో. వారి స్ఫూర్తితో ముందడుగు వేస్తున్న ఈతరం ఆడబిడ్డలు మరెందరో. ప్రతి స్త్రీమూర్తికీ మనస్ఫూర్తిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఆకాశమే హద్దుగా దూసుకువెళ్లగల సత్తా వీరి సొంతం. వీరికి …
Read More »జగన్ గెలుపు మహిళల గెలుపు… : వాసిరెడ్డిపద్మ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని కోట్లాదిమంది మహిళలు హృదయ హారతి పడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బిగ్ థాంక్స్ చెబుతున్నామని శ్రీమతి వాసిరెడ్డి పద్మ అన్నారు. వైయస్సార్సీపి కేంద్ర కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి వాసిరెడ్డి పద్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా కేక్ కట్ చేసి మహిళల విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణికి తినిపించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ …
Read More »