ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.2 లక్షల 50వేల రూపాయల చెక్కు  పంపిణీ

-మంత్రి వేణుగోపాలకృష్ణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజల ఆరోగ్య భద్రతకు కొండంత భరోసానిస్తోందని జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ సంక్షేమం, రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. శుక్రవారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద మంజూరైన రూ.2 లక్షల 50 రూపాయల చెక్కును లబ్ధిదారాలైన పాము రామకృష్ణ వారి సతీమని అనంతలక్ష్మి కి మంత్రి వేణుగోపాలకృష్ణ అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాజమహేంద్రవరం రూరల్ మండలం హుకుంపేట గ్రామానికి చెందిన పాము చిరంజీవి లుకేమియా క్యాన్సర్ వ్యాధి సమస్యతో ఇటీవలి మరణించడం జరిగిందని, పాము చిరంజీవికి మంజూరు కాబడిన సీఎం రిలీఫ్ ఫండ్ ను వారి వారి తల్లిదండ్రులైన పాము రామకృష్ణ వారి సతీమని అనంతలక్ష్మి రు. 2 లక్షల 50 రూపాయల చెక్కును నేడు అందిస్తున్నామన్నారు. వీరికి సీఎం రిలీఫ్ ఫండ్ త్వరిత గతిన వచ్చే విధంగా కృషి చేయడం జరిగిందని మంత్రి వేణుగోపాల కృష్ణ అన్నారు.

పాము చిరంజీవి ఇటీవలి ఇంటర్మీడియట్ ఎగ్జాం పూర్తి చేసుకుని రాజమండ్రి లో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యాభ్యాసానికి సీటు కేటాయింపు కూడా జరిందన్నారు. అయితే పాము చిరంజీవి లుకేమియా క్యాన్సర్ వ్యాధితో మరణించడం చాలా బాధాకరమని మంత్రి అన్నారు.

పేదల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి  రాష్ట్రం ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలవెన్నంటి ఉంటుందని తెలిపారు. పేద ప్రజల ఆరోగ్య భద్రత కొరకు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా రూ.25 లక్షలకు పెంపు చేసి ఖరీదైన కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి పేద వాడిని ఆదుకోవడానికి ఆరోగ్యశ్రీ పథకం వర్తించని జబ్బులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పేదప్రజలకు ఆర్థిక సహాయం అందిస్తూ ఆదుకుంటున్నారని మంత్రి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *