విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తమ నిర్ణయాన్ని చెబుతున్నామని, ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వడం లేదని ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ జాఫర్ అలీ తెలిపారు. శుక్రవారం గాంధీనగర్, ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సయ్యద్ జాఫర్ అలీ మాట్లాడుతూ ముస్లింల సంక్షేమం విషయంలో మరియు ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల కేటాయింపులో నాటి నుండి నేటి వరకు వివిధ రాష్ట్ర ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు తమ మేనిఫెస్టోలో అబద్ధపు హామీలు ఇస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 30 నుండి 40 స్థానాలలో ముస్లింలు అధికంగా ఉన్నారని వారికి సీట్ల రూపంలో సముచిత స్థానం కల్పించాలని మూడు లేదా ఐదు లేదా ఏడు సీట్లు మాత్రమే కేటాయించి ముస్లింల పట్ల వివక్షత ధోరణి ప్రదర్శిస్తున్నారన్నారు. ఈ తరుణంలో ముస్లిం ఐక్యవేదిక ఏ పార్టీకి కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించిందని ఆయన తెలిపారు. అలాగే పార్టీలు చూడకుండా ముస్లిం అభ్యర్థులని పరిగణలోకి తీసుకుంటుంది వారి గెలుపును కోసం కృషి చేస్తుందన్నారు. ముస్లిం సమాజ సంపూర్ణ ఓటు వినియోగం అయ్యేలా కార్యాచరణ సిద్ధం చేస్తుందన్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికలలో ముస్లింలకు సీట్లు ఇవ్వకుండా మోసం చేసిన ప్రధాన పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ముస్లిం ఐక్యవేదిక పేరుతో ఎవరైనా తప్పుడు ప్రచారం చేసినా, లేదా ముస్లిం ఐక్యవేదిక పేరు చెప్పి పని చేసిన వారిపై చట్టపకారం చర్యలు తీసుకోబడుతుందన్నారు. అదేవిధంగా అభ్యర్థులు మా అనుమతి లేకుండా లేదా మద్దతు లేకుండా ముస్లిం ఐక్యవేదిక మద్దతు ఉందని, ప్రచారం చేసిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ సలావుద్దీన్ ట్రెజరర్, రెహమాన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, నూర్ఖాన్ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సర్దార్ అహ్మద్ ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ, నసీమా ఎన్టీఆర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు, సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News