Breaking News

అత్యంత భక్తిశ్రద్ధలతో పశ్చాత్తాప పాదయాత్ర

-చేతిలో సిలువను పట్టుకొని క్రీస్తు ప్రభువు అనుభవించిన పాటులను ధ్యానిస్తూ సాగిన పశ్చాత్తాప పాదయాత్ర
-పశ్చాత్తాప పాదయాత్ర అనంతరం పలువురు గురువులచే సమిష్టి దివ్యబలి పూజ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇబ్రహీంపట్నం సహాయం మాత దేవాలయ విచారణ గురువు ఫాదర్ అనిల్ , మరియు సహాయక గురువు ఫాదర్ జోసెఫ్ శుక్రవారం పశ్చాత్తాప పాదయాత్ర నిర్వహించారు. ఉదయం 6 గంటలకు సహాయమత దేవాలయం నుండి ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వెంబడి మూలపాడు దేవాలయం వరకు అత్యంత భక్తి శ్రద్ధలతో సాగింది పశ్చాత్తాప పాదయాత్ర, ఈ పశ్చాత్తాప పాదయాత్రలో ప్రతి ఒక్కరు చేతిలో క్రీస్తు మరణించిన సిలువను మోస్తూ , క్రీస్తు అనుభవించిన శ్రమలను ధ్యానిస్తూ, మానవాళి కొరకు ఏసుప్రభు సిలువను మోస్తూ, మానవాళి పాప విమోచన కొరకు శిలువపై మరణించిన మరణ సంఘటనను గుర్తు చేసుకుంటూ కాలినడకన పశ్చాత్తాప పాదయాత్రగా ముందుకు సాగారు. మూలపాడు దేవాలయం చేరుకునే వరకు భక్తిశ్రద్ధలతో జపమాల జపిస్తూ, పరిశుద్ధ సిలువ మార్గాన్ని నిర్వహించారు. అత్యంత పవిత్రమైన శ్రమ దినాలను యా వత్తు రాష్ట్ర దేశవ్యాప్తంగా ఈ 40 రోజుల క్రైస్తవులందరూ మరి ముఖ్యంగా రోమన్ క్యాథలిక్ కు లు ఈ 40 రోజులు అత్యంత భక్తిశ్రద్ధలతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ, ఏసుప్రభు పొందిన గాయముల చేత, మనలను రక్షించిన విధానాన్ని ధ్యానిస్తూ, ప్రతినిత్యము ప్రార్థనలు చేస్తూ, వారి భక్తి చాటుతున్నారు.మరి ముఖ్యంగా శుక్రవారం నిర్వహించిన పశ్చాత్తాప పాదయాత్ర ప్రతి ఒక్కరూ తమ శరీరమును , మనసును, ఆత్మను అదుపులో పెట్టుకుని, ఇలాంటి పుణ్యక్రియల ద్వారా దేవునికి ఇంకా దగ్గర కావడానికి ఈ పశ్చాత్తాప పాదయాత్ర ఎంతగానో ఉపయోగపడుతుందని , మనమే కాకుండా ఇతరులకు కూడా ఇలాంటి పవిత్ర క్రియల ద్వారా దేవునికి దగ్గర కావచ్చు అని సహాయక గురువు జోసఫ్ తెలిపారు. కాలినడకన నడుస్తూ ములపాడు దేవాలయం చేరుకున్న అనంతరం కొండపై పరిశుద్ధ సిలువ మార్గము నిర్వహించారు .అనంతరం పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబం లో అవసరాలను తీర్చాలని, కుటుంబంలో ఇబ్బందులు తొలగిపోవాలని, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, ఇంటర్మీడియట్ మరియు 10వ తరగతి పరీక్షలు రాస్తున్న ప్రతి ఒక్కరి కోసం ఫాదర్ .మరియదాస్ , ఫాదర్ .జీవన్, ఫాదర్ అనిల్ , ఫాదర్ జోసఫ్ సమిష్టి దివ్య బలిపూజను నిర్వహించారు. ఈ పశ్చాత్తాప పాదయాత్రలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని క్రీస్తు అనుభవించిన శ్రమలను పాటలను ధ్యానించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *