Breaking News

Telangana

క్షయ వ్యాధిపై అవగాహనా శిభిరాలు ప్రారంబం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో ఆటోనగర్ నాలుగవ క్రాస్, ఐదవ రోడ్డు నందు 21 రోజుల క్షయ వ్యాధి అవగాహనా శిభిరాలను సి.హెచ్. దినేష్, జిల్లా క్షయ వ్యాధి నియంత్రణా సమన్వయకర్త ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోనగర్ కార్మికులు ఆరోగ్యం కొరకు వాసవ్య మహిళా మండలి క్షయ పై అవగాహనా శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయం అని, క్షయవ్యాధి లక్షణాలైన రొండు వారాలకు మించి దగ్గు, ఆకలి లేకపోవడం, బరువు కోల్పోవడం, తరచూ …

Read More »

సజావుగా జరుగుతున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయ అర్హత పరీక్షలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల అర్హత పరీక్షలలో ఈరోజు సాంఘిక శాస్త్రం తెలుగు భాషా ఉపాధ్యాయులకు పరీక్షలు జరిగాయి. ఉదయం జరిగిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ అర్హత పరీక్షలో 14,482 మందికి గాను 12076 మంది అంటే 83.38 శాతం మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన తెలుగు భాషా ఉపాధ్యాయుల అర్హత పరీక్ష లో 16,524 మందికి గాను 15,048 మంది అంటే 91.06% మంది హాజరయ్యారు. ఉపాధ్యాయ అర్హత పరీక్షల …

Read More »

నేటి నుండి (5.3.24) విద్యాహక్కు చట్టంలో భాగంగా ప్రైవేటు పాఠశాలల్లో 25 % కోటా కింద ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉచిత విద్యా హక్కు చట్టం – 2009 ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25శాతం సీట్లు అనాథలు, దివ్యాంగులు, సామాజికంగా, ఆర్థికంగా, వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తదనుగుణంగా 09.02.2024 నుండి 01.03.2024 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు (9,350) విద్యాహక్కు చట్టం కింద 25 శాతం సీట్లు కేటాయించేందుకు రిజిస్ట్రేషన్ చేయబడ్డాయి. నేటి నుండి (5.03.24) రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని విద్యార్థులు 25 శాతం కోటా …

Read More »

ఐ.టి.విభాగం పనితీరుని అభినందించిన సంస్థ ఎం. డి. సిహెచ్. ద్వారకా తిరుమల రావు

-నిన్న కోల్ కతా లో అవార్డు అందుకున్న అధికారులు -ఏ.పి.ఎస్.ఆర్.టి.సి.కి మరోసారి దక్కిన ప్రతిష్టాత్మక అవార్డు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2024 వ సంవత్సరానికి గాను ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్’ విభాగంలో వరుసగా 6వ సారి ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డుకు ఎంపికై, నిన్న అనగా 02.03.2024వ తేదీన కోల్ కతలో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో జాతీయ స్థాయిలో వివిధ ప్రభుత్వ సంస్థలతో పోటీపడి ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. ఈ అవార్డు గెలుచుకుంది.  కాగా, ఈ రోజు సంస్థ ఎం.డి. సిహెచ్. …

Read More »

స్పందనకు 167 వినతులు

-స్పందన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మి శ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో అర్థవంతoగా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా.జి .లక్ష్మి శ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన స్పందన గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ తో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మురళి, భాస్కర్ నాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, దేవేంద్ర రెడ్డి తో …

Read More »

బిఎంసియు లు పూర్తి స్థాయిలో రేపటికల్లా పని చేసేలా చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాడి రైతుల మేలు కోసం చేస్తున్న బృహత్తర పథకం జగనన్న పాల వెల్లువ అని, అమూల్ సంస్థ అనుబంధంతో వారు పాడి రైతులకు మంచి గిట్టుబాటు ధర అందించి పాలు కొనుగోలు చేసి మహిళా పాడి రైతులకు ఆర్థిక పరిపుష్టి కలిగించేందుకు బిఎంసియు లు పూర్తి స్థాయిలో పనిచేసేలా, ఎఎంసియు ల ద్వారా పాలసేకరణ త్వరితగతిన చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం …

Read More »

రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నోడల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలి : డి ఆర్ ఓ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికలు – 2024 నేపథ్యంలో నోడల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని డి ఆర్ ఓ పెంచల్ కిషోర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నందు సార్వత్రిక ఎన్నికలు- 2024 విధులను కేటాయించిన నోడల్ ఆఫీసర్ లకు ఎన్నికలలో నిర్వహించవలసిన విధుల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి ఆర్ ఓ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల నిర్వహణలో నోడల్ …

Read More »

నేడు జరిగిన మొదటి సంవత్సరం ఇంటర్ ఇంగ్లీష్ పేపర్ -1 పబ్లిక్ పరీక్షలకు 32,639 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 32369 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్.ఐ. ఓ జీ.వి.ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 87 జనరల్, 14 వొకేషనల్ కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంగ్లీష్ పేపర్-1 పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు జనరల్ 31,974 మంది, ఒకేషనల్లో 1,506 మంది మొత్తం …

Read More »

రైల్వే మరియు జాతీయ రహదారుల పై సమీక్షించిన కేంద్ర అధికారులు

-తిరుపతి జిల్లాలో నడికుడి శ్రీకాళహస్తి మధ్య రైల్వే లైను కు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పనుల పురోగతి వేగవంతం: జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రైల్వే మరియు జాతీయ రహదారుల కు సంబంధించిన భూసేకరణ మరియు పరిహార పంపిణీ, బడ్జెట్ విడుదల పలు అంశాలపై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎంజి, న్యూఢిల్లీ నుండి కేంద్ర అధికారులు వివిధ రాష్ట్రాల కార్యదర్శులు కలెక్టర్లు, జేసీలు, జాతీయ రహదారుల అధికారులతో నిర్వహించిన వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్లో ఆంధ్రప్రదేశ్ …

Read More »

నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరుపున అభ్యర్ధులకు ఉచితంగా బి-పామ్ ఇస్తుంది… : జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.  స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో షేక్ జలీల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో 175 ఎంఎల్ఎ స్థానాలకు 25 ఎంపి స్థానాల కు మరియు తెలంగాణ రాష్ట్రానికి ఎంపి స్థానాలకు కేంద్ర ఎఎన్నికల సంఘం బకెట్ గుర్తును కేటాయించడం జరిగినదన్నారు. అదే విధంగా కర్ణాటక రాష్ట్రానికి 28 ఎంపి స్థానాలకు మాకు గాజు గ్లాస్ కేటాయించడం జరిగినది …

Read More »