Breaking News

Daily Archives: May 10, 2024

పోలింగ్ సజావుగా జరిగేందుకు కృషి చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు, పోలింగ్ సిబ్బందికి అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాలని, పోలింగ్ సజావుగా జరిగేందుకు కృషి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, వీఆర్వోలతో శుక్రవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పోలింగ్ సజావుగా జరిగేందుకు తీసుకోవలసిన చర్యలపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వీఆర్వోలు వారి పరిధిలో ప్రతి పోలింగ్ కేంద్రం తనిఖీ చేసి, …

Read More »

’వీ యాప్’పై ఈసీకి వైసీపీ బృందం ఫిర్యాదు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని చౌర్యం చేస్తున్న తెలుగుదేశం పార్టీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని వైసీపీ బృందం కోరింది. ఈ మేరకు శుక్రవారం వెలగపూడి సచివాలయం నందు సీఈవో ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదునందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గోప్యంగా ఉండాల్సిన ప్రజల సమాచారాన్ని.. ‘వీ యాప్’ లో పొందుపరిచి తెలుగుదేశం పార్టీ డేటా చౌర్యం చేస్తోందని మల్లాది విష్ణు ఆరోపించారు. దీని ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడంపై ఈసీకి ఫిర్యాదును అందజేసినట్లు తెలిపారు. అలాగే …

Read More »

కూటమికి ఓటు వస్తే సముద్రంలో వేసినట్లే..

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమికి ఓటు వేస్తే సముద్రంలో వేసినట్లేనని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మధురానగర్లో ఎన్నికల ప్రచార అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలయిక అట్టర్ ఫెయిల్యూర్ అని ఈ సందర్భంగా మల్లాది విష్ణు విమర్శించారు. 2014-19 మధ్య మీ ఐదేళ్ల పాలనలో ప్రజలకు జరిగిన మంచి ఒక్కటైనా ఉందా..? సమాధానం చెప్పాలన్నారు. దేశ చరిత్రలో మేనిఫెస్టోకు సరికొత్త …

Read More »

సీఎం జగనన్న పాలనకు మరెవరూ సాటిరారు

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అభివృద్ధి, సంక్షేమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశంలోనే శిఖరాగ్రాన నిలిచిందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వెలంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 29వ డివిజన్ మధురానగర్లోని నేతాజీ రోడ్డు, కొబ్బరితోటలో శుక్రవారం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి, వెలంపల్లి సోదరుడు వెలంపల్లి రాఘవతో ప్రతి గడపకు వెళ్లి.. ఈ ప్రభుత్వంలో జరిగిన మేలును …

Read More »

చివరి 72 గంటల్లో, పోలింగ్ రోజు చేయాల్సిన ఏర్పాట్లు ఇవే

-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 13న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లా ఎన్నికల యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం చివరి 72 గంటల్లో మరియు పోలింగ్ రోజు చేయాల్సిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో వివరించారు. హింసకు, రీపోలింగ్ కు తావు లేకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో న్యాయంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యూహాత్మకమైన చర్యలు చేపట్టాలని …

Read More »

పీసీలకు 4,44,216,ఏసీలకు 4,44,218 పోలైన పోస్టల్ బ్యాలెట్

-రాష్ట్రంలో మే 09న ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల విధులో ఉన్న ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు 4,44,216 మరియు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4,44,218 పోస్టల్ బ్యాలెట్ పోలైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ …

Read More »

గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ కాన్క్లేవ్

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ కాన్క్లేవ్” 6వ ఎడిషన్ న్యూఢిల్లీలో 10 మే 2024న నిర్వహించారు. గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ కాన్క్లేవ్‌లో ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ పాలసీ మేకర్స్, యూనివర్శిటీ ఛాన్సలర్లు & వైస్ ఛాన్సలర్లు, స్కూల్ చైన్ ఓనర్లు & డైరెక్టర్లు, ఎడ్టెక్ లీడర్‌లు మరియు గ్లోబల్ థాట్ లీడర్‌లు పాల్గొంటారు. ఈ సమావేశంలో ముఖ్య వక్తగా పి.రాజా బాబు I.A.S, MD&CEO, APSSDC మాట్లాడుతూ, పెరుగుతున్న మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా నైపుణ్యతలో …

Read More »

దేశ సమగ్రాభివృద్ధి కి ఇండియా కూటమిని గెలిపించండి… : గాంధీ నాగరాజన్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ సమగ్రాభివృద్ధి, పరిరక్షణ, సంక్షేమం కోసం ఇండియా కూటమిని అభ్యర్థులను గెలిపించాలని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షుడు ఆర్‌.ఆర్‌.గాంధీ నాగరాజన్‌ పిలుపు నిచ్చారు. శుక్రవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో లోని పంజసెంటర్ ప్రచారం నిర్వహించారు. ఇండియా కూటమి బలపర్చిన సీపీఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న ఎత్తుగడలను ఎండ గట్టాలన్నారు. ప్రస్తుత ఎన్నికలు పేదలు, పెట్టుబడిదారులకు, మంచికి, …

Read More »

జైభారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ పోస్టర్ ఆవిష్కరన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో జైభారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ పోస్టర్లను ఆవిష్కరన జరిగింది. గాంధీ నగర్ ప్రెస్ క్లబ్లో లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశం లో వక్తలు మాట్లాడుతూ ఓటు హక్కును అందరూ వినియోగించుకొని భాగస్వాములు కావాలన్నారు. ఓటు అనేది శక్తివంతమైన ఆయుధమని దానిని సరైన వ్యక్తి కి ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జైభారత్ జాతీయ కార్యదర్శి ఖదిజ్ఞాసి లోక్ నాథ్, జైభారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ రాష్ట్ర కార్యదర్శి మీసాల రాము, జైభారత్ జస్ట్ …

Read More »

మే 11వ తేదీ రా. 6 గం. ల నుండి పోలింగ్ ముగిసే సమయం వరకు 48 గం.లు జిల్లాలో ఎన్నికల ప్రచారంపై ఆంక్షలు

-జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 126 మేరకు మే 11వ తేదీ సాయంత్రం. 6 గం.ల నుండి పోలింగ్ ముగిసే 48 గంటల సమయం వరకు, ఎన్నికల ప్రచారం ముగిసిన దగ్గర నుంచి బహిరంగ సభల నిర్వహణను నిషేదించడం జరుగుతుందని, ఆ సమయంలో ఏ వ్యక్తి కూడా ఎన్నికలకు సంబందించి ఎటువంటి బహిరంగ సభ లేదా ఊరేగింపులను సమావేశపరచడం, ర్యాలీలు, నిర్వహించడం లేదా హాజరు …

Read More »