Breaking News

Daily Archives: May 16, 2024

పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు… : పవన్ కళ్యాణ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 13న జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం అభ్యర్ధిగా పోటీ చేసిన నన్ను ఆదరించి అండగా నిలిచి మీరు చూపించిన ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు. పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నాను అని ప్రకటించగానే స్వచ్చందంగా తరలివచ్చి మీ కుటుంబ సభ్యుడిగా భావించి పని చేయడం ఎంతో ఆనందం కలిగించింది. నిన్న జరిగిన ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా రాత్రి 10 గంటల సమయం వరకూ పోలింగ్ లో పాల్గొని రికార్డ్ స్థాయిలో 86.63 …

Read More »

మ‌ళ్లీ అధికారం మాదే… : జ‌గ‌న్ 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వస్తున్నామని వైసీపీ అధినేత, సీఎం జగన్ అన్నారు. ఐప్యాక్ కార్యాలయానికి వచ్చిన జగన్ అక్కడి ప్రతినిధులతో మాట్లాడారు. ఐప్యాక్ టీం ప్ర‌తినిధుల‌తో జ‌గ‌న్ స‌మావేశ‌మ‌య్యారు. ఈసంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ… గత ఎన్నికల్లోనూ ఎవరూ 151 సీట్లు వస్తాయని నమ్మలేదన్నారు. ఈసారి కూడా అంతకంటే ఎక్కువ స్థానాలు వస్తాయని చెప్పారు. మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామ‌న్నారు. 2019లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచాం.. ఈసారి గతంలో కంటే ఎక్కువ సీట్లే గెలుస్తామ‌న్నారు. ఏపీలో …

Read More »

టిడిపి మ‌హానాడు వాయిదా…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సంవత్సరం జరిగే టీడీపీ మహానాడు కార్యక్రమానికి ఈ ఏడాది బ్రేక్‌ పడింది. దానికి కారణం ఎలక్షన్‌ ఫలితాలు. అసలు అయితే ఈనెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు జరగాల్సి ఉంది. అయితే జూన్ 4న ఎన్నికల ఫలితాలు, అందుకు ఏర్పాట్లు, అనంతరం ప్రభుత్వం ఏర్పాటు హడావుడి ఉండటంతో వాయిదా వేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా వెల్లడించారు. అయితే మహానాడు మాదిరిగా …

Read More »

షిర్డీలో తెలుగువారు నిర్వహిస్తున్న ఆశ్రమాన్ని సందర్శించిన చంద్రబాబు దంపతులు

షిర్డీ, నేటి పత్రిక ప్రజావార్త : షిర్డీలో తెలుగువారు నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి సందర్శించారు. సాయిబాబా దర్శనానికి గురువారం మహారాష్ట్ర వెళ్లిన చంద్రబాబు దంపతులు ఆ ఆశ్రమాన్ని సందర్శించారు. ద్వారకామయి పేరుతో నిర్వహిస్తున్న ఈ వృద్ధాశ్రమాన్ని తెలుగు వారైన బండ్లమూడి రామ్మోహన్ ఛైర్మన్ గా, బండ్లమూడి శ్రీనివాస్ ట్రస్టీగా ఉన్నారు. ఇందులో 150 మంది వరకూ వృద్ధులు ఆశ్రమం పొందుతున్నారు. చంద్రబాబు, భువనేశ్వరి వృద్ధులను ఆప్యాయంగా పలకరించి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమం నిర్వహిస్తున్న రామ్మోహన్, …

Read More »

కొల్హాపూర్ శ్రీమహాలక్ష్మీ అమ్మవారిని, షిరిడీ సాయిబాబాను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు

మహారాష్ట్ర, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర పర్యటనలో మహారాష్ట్రలో గల కొల్హాపూర్‌ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని సతీ సమేతంగా సందర్శించారు. ఆలయంలో చంద్రబాబు, భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడీ వెళ్లారు. షిరిడీలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వర్గాలు చంద్రబాబు దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. చంద్రబాబు దంపతులకు ఆలయ అధికారులు జ్ఞాపిక బహుకరించారు. ఇప్ప‌టికే తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న ఆయ‌న తాజాగా కొల్హాపూర్, షిర్డీ వెళ్లారు.

Read More »

నేటి నుంచి (మే 17) డి సెట్ – 2024 హాల్ టికెట్ల విడుదల

-మే 24న ప్రవేశ పరీక్ష -పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే డిసెట్ (DEECET-2024) ఈనెల 24న నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ఎస్.సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 22న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన తమ హాల్ టికెట్లు నేటి నుంచి (17.5.24) https://cse.ap.gov.in/ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు …

Read More »

ఎపీలో జరిగిన పోలింగ్ శాతం చూస్తే ప్రజల స్పందన అర్దమవుతుంది… : పాతూరి నాగభూషణం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎపీలో జరిగిన పోలింగ్ శాతం చూస్తే ప్రజల స్పందన అర్దమవుతుందని బిజెపి రాష్ట్ర మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం అన్నారు. గురువారం బిజెపి రాష్ట్ర కార్యాలయం లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం తీసుకున్న అనేక చర్యలతో ప్రజలు ఓట్లు వేసేందుకు తరలి వచ్చారన్నారు. ఓటు హక్కు తమ బాధ్యత అని ప్రజలు భావించి ఉదయం నుంచే బారులు తీరారన్నారు. ఐప్యాక్ టీం సమావేశంలో 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ వస్తాయని …

Read More »

తొలి నాలుగు దశల్లో 66.95 శాతం ఓటింగ్‌ నమోదు

-ఇప్పటివరకు 45.1 కోట్ల మంది ప్రజలు ఓటు వేశారు -మిగిలిన 3 దశల్లో కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదు అయ్యేలా మెరుగైన చర్యలు చేపట్టాలని సంబందిత రాష్ట్రాల సీఈఓ లకు పిలుపునిచ్చిన ఎన్నికల సంఘం -“అధిక ఓటింగ్ శాతమే” ప్రపంచానికి భారతీయ ఓటర్లు ఇచ్చిన సందేశం -పబ్లిక్/ప్రైవేట్ సంస్థలు, సెలబ్రిటీలు ఓటర్ల ప్రచార కార్యక్రమాల్లో భాగస్వామ్యులు కావాలి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇప్పటి వరకూ పూర్తయిన నాలుగు దశల్లో 66.95% పోలింగ్ నమోదైంది, 45.1 …

Read More »

సీనియర్ రెసిడెంట్ ఖాళీ భర్తీకి ఈ నెల 28న వాక్ ఇన్ ఇంటర్వ్యూ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ లోని ప్రభుత్వ దంత కళాశాల మరియు ఆసుపత్రిలో PEDODONTICS విభాగంలో సీనియర్ రెసిడెంట్ ఖాళీ భర్తీకి ఈ నెల 28న వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామని ప్రభుత్వ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి ఇంచార్జి ప్రిన్సిపాల్ జె. నరేంద్రదేవ్ ఒక ప్రకటనలో తెలిపారు. MDS ఉత్తీర్ణులైన వారు సీనియర్ రెసిడెంట్ ఖాళీకి అర్హులని, ఒక సంవత్సర కాలం పాటు పనిచేయవలసి ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలకు http://gdchvja.in/ వెబ్ సైట్ ను …

Read More »

ఓట్ల లెక్కింపుకు అధికారులు ప్రణాళిక బద్ధంగా ఏర్పాట్లు చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓట్ల లెక్కింపుకు అధికారులు ప్రణాళిక బద్ధంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు అన్నారు. జూన్ 4వ తేదీన చేపట్టే ఓట్ల లెక్కింపుకు చేపట్టవలసిన ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ లో కలెక్టర్ ఢిల్లీ రావు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమిష్టి కృషితో జిల్లాలో పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించామని ఇదే స్ఫూర్తిని లెక్కింపు ప్రక్రియలోను కొనసాగించి విజయవంతం చేయాలన్నారు. ఇబ్రహీంపట్నం జూపూడి లోని …

Read More »