-వరద బాధితులు అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది -చంద్రబాబు నేతృత్వంలో ప్రజలకు అండగా నిలిచేందుకు ముమ్మర చర్యలు -అవివేకంతోనే జగన్ అర్థంపర్థం లేని ఆరోపణలు -వరద బీభత్సాన్ని కేంద్ర బృందం స్వయంగా పరిశీలించింది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో బుడమేరు ఉగ్రరూపంతో ముంపుకు గురై తీవ్ర నష్టాన్ని చవిచూసిన బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర న్యాయ,మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ భరోసా ఇచ్చారు. శుక్రవారం అజిత్ సింగ్ నగర్ లో వరద బీభత్సంతో ఐదవ రోజు కూడా …
Read More »Daily Archives: September 6, 2024
వరద బాధితులకు దుప్పట్లు, చీరలు, మందులు నిత్యావసర వస్తువులు పంపిణీ
-అపన్న హస్తం అందించిన జమ్మలమడుగు ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి, కడప పార్లమెంట్ ఎన్డీఏ కూటమి ఇన్చార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : *బుడమేరు వరద ముంపుతో సర్వం కోల్పోయిన నగరంలోని కబేలా, వించిపేట ,నైజాం గేట్, జ్యోతి నగర్, వన్ టౌన్ ప్రాంతాల్లో బాధితులకు శనివారం జమ్మలమడుగు ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి, కడప పార్లమెంట్ ఎన్డీఏ కూటమి ఇన్చార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి ఆపన్నహస్తం అందించారు. గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు సర్వం …
Read More »అడవుల విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు..
-దేవరపల్లి, మారేడుమిల్లి ఘటనల్లో ఇప్పటికే అధికారుల సస్పెండ్.. -నిష్పక్షపాతంగా విచారణ.. తుది నివేదిక రాగానే చర్యలు.. -చిరంజీవ్ చౌదరి, ప్రిన్సిపల్ ఛీప్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అటవీశాఖపై మీడియాలో వస్తున్న వార్తలకు ప్రిన్సిపల్ ఛీప్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవ్ చౌదరి స్పందించారు. 22.02.2024న PCCF & HOFF జారీ చేసిన సూచనల ప్రకారం, DFO, ఫ్లయింగ్ స్క్వాడ్, రాజమండ్రి వారు తన బృందంతో కలిసి 28.02.2024 నుండి 07.03.2024 వరకు రంపచోడవరం డివిజన్ లో నిర్దిష్ట …
Read More »ఈ నెల సెప్టెంబర్ 10 నుండి “పొలం పిలుస్తోంది” కార్యక్రమాన్ని జిల్లాలోని రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలి
-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 10వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ” పొలం పిలుస్తోంది” అనే కార్యక్రమం నిర్వహించబడుతుందని, జిల్లాలోని రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ గారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు తదితర సంబంధిత అధికారులతో కలిసి “పొలం పిలుస్తోంది” కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా …
Read More »జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు పరిశీలిన…
-జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో చేపట్టిన పలు పనులను అమృత్ సరోవర్ చెరువు అభివృద్ధి పనులు ఫారం పాండ్లు, హార్టి కల్చర్, ఫ్లోరి కల్చర్ తదితరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన భారత గ్రామీణాభివృద్ధి డిప్యూటీ సెక్రెటరీ అషీస్ గుప్త తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా నందు అమలు జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు, దాని అనుసంధానంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను, అమృత్ సరోవర్ చెరువు అభివృద్ధి పనులు, …
Read More »జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు : జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి సందర్భంగా జిల్లాలోని ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో పర్యావరణ హితంగా ఉత్సవాలు జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ నేడు ఒక ప్రకటనలో వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి ఎంతో పవిత్రమైన పండుగ అని, అన్ని విఘ్నాలను, సంకటాలను హరించి విజయాన్ని అందించే వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజలందరి ఇంటా విఘ్నాలు తొలగి వారు ఆయు ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, సౌభాగ్యాలతో సిరి సంపదలతో తుల తూగాలని సుహృద్భావ …
Read More »స్విమ్స్ ఆధ్వర్యంలో బంగారంపేటలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్విమ్స్, శ్రీ బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ ఆధ్వర్యంలో చెంబేడు పిహెచ్ సి పరిధిలోని బంగారంపేట విలేజ్ హెల్త్ సెంటర్ లో శుక్రవారం ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతోంది. ఇందులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలను …
Read More »ప్రాధమిక స్థాయిలో క్యాన్సర్ లక్షణాలను గుర్తించిన వారికి త్వరగా నిర్ధారణ పరీక్షలు చేయండి
-చిత్తూరు జిల్లా జడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి నేడు జరిగిన చిత్తూరు జిల్లా జడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి తిరుపతి జిల్లా పరిధిలో క్యాన్సర్ స్క్రీనింగ్ గూర్చి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు పలు ప్రశ్నలు సంధించారు. వైద్య ఆరోగ్య శాఖ వారు ఇచ్చిన లెక్కల ప్రకారం 77,717 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేశామని 190 మందికి …
Read More »పర్యావరణ హితంగా పండుగను చేసుకోవాలి… : ఎంపీ మద్దిల గురుమూర్తి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి వినాయక నిమజ్జన కమిటీ ఆదర్వంలో నిర్వహించిన సమావేశంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ప్రజలందరూ భక్తి శ్రద్దలతో ఘనంగా వినాయకచవితి జరుపుకోవాలని అన్నారు. పర్యావరణానికి హాని కలగకుండా పర్యావరణ హితంగా పండుగను చేసుకోవాలని పిలుపునిచ్చారు. అందరికీ ముందస్తు వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
Read More »బాల్య వివాహాల నిలుపుదల మరియు బాల్య వివాహాలపై అవగాహన…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు ఐ. సి డి యస్ ప్రాజెక్టు పరిధిలో కొవ్వూరు నందు సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాత్సవ్ వారి ఆద్వర్యం లో స్ధానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం బేటి బచావో బేటి పడావో లో బాగంగా డివిజన్ స్థాయి బాల్య వివాహాల నిలుపుదల మరియు బాల్య వివాహాలపై అవగాహన సమావేశము నిర్వహించడమైనది. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ మాట్లాడుతూ, బాల్య వివాహాల వలన జరిగే నష్టాలు గురించి ప్రజల్లో విస్తృత స్థాయిలో …
Read More »