Breaking News

Daily Archives: September 6, 2024

మౌలిక వసతుల కల్పనకు తగిన చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ప్రభావిత ప్రాంతాల చేపట్టిన సహాయక చర్యల్లో సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వహించాలని, సిబ్బందికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటామని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. విజయవాడ నగరంలోని 62వ డివిజన్లోని ఎల్బీఎస్ నగర్, పటేల్ నగర్, లక్ష్మీ నగర్, ప్రకాష్ నగర్ మెయిన్ రోడ్, రాదా నగర్ తదితర ప్రాంతాల్లో చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య పనులను శుక్రవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించి సిబ్బందికి గుంటూరు నగర …

Read More »

పర్యావరణహిత వినాయక చవితి వేడుకలకు కంకణబద్దులు కావాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మట్టి గణపతే మహా గణపతి అ ని ప్రతి ఒక్కరూ పర్యావరణహిత వినాయక చవితి వేడుకలకు కంకణబద్దులు కావాలని , ప్రధానంగా యువత కాలుష్యరహిత పండుగల నిర్వహణలో ముందుభాగాన ఉండాలని గుంటూరు నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శుక్రవారం ఒక ప్రకటన లో కోరారు. ఈ సందర్భంగా కమీషనర్ గుంటూరు నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ…నగర ప్రజలనిద్దేశించి మాట్లాడుతూ వివిధ రకాల రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసే విగ్రహాల వల్ల …

Read More »

సీఎం ఆదేశాలతో ప్రజలకు అందుబాటులో ఇసుక సమాచారం

-28 ఇసుక నిల్వ కేంద్రాలలో 14,35,957 మెట్రిక్ టన్నుల ఇసుక -రాష్ట్ర గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్టంలో అందుబాటులో ఉన్న ఇసుక వివరాలను ప్రతి రోజు ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామని వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, గనులు, ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సీఎం సూచనల మేరకు బుకింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, …

Read More »

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు

-విజయవాడ వరద బాధితుల సహాయార్థం తూర్పు గోదావరి జిల్లా దాతలు ముందుకు రావడం అభినందనీయం -పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విజయవాడ/ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నవినాయక చవితి పండుగ సంధర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియ చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక , సినిమాతో గ్రాఫిక్ శాఖ మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరంలో వరద బాధితుల సహాయార్థం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి …

Read More »

జిల్లాలో ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

-కలెక్టరు పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి పండుగ సంధర్భంగా జిల్లా ప్రజలకి శుభాకాంక్షలు తెలియ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మట్టి గణపతి విగ్రహాలకు మాత్రమే పూజలు చేసి, పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతుగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. వినాయక చవితి పండుగ జరుకునే విధానంలో ప్రకృతిలో సహజంగా లభించే వాటితోనే పూజలు చేయడం పురాతనకాలం ఆచారంగా వస్తోందని పేర్కొన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తదితర నీటిలో …

Read More »

వరద బాధితులకు నైబర్ ఫౌండేషన్ వితరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో జరిగిన వరదలలో నిరాశ్రయులకు కాకినాడకు చెందిన నైబర్ ఫౌండేషన్ ఆహార పదార్థాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. గాజుల పేట, వై ఎస్ ఆర్ కాలనీ 1, మరియు 2 లలో పేదలకు, మరియు ఫెర్రీ ప్రాంతంలో సర్వం నష్టపోయిన పేదలకు తమ వంతుగా ఆహార పదార్థాలతో పాటు, దుప్పట్లు వితరణ గావించారు. సుమారు 2500 మందికి సహాయం చేసినట్లు ఫౌండేషన్ అధ్యక్షులు ఎం.సూర్యారావు తెలిపారు. ఇందుకోసం రూ. 4లక్షల50 వేలు ఖర్చు చేసినట్లు వివరించారు. ఈ …

Read More »

వరద బాధితులకు నిత్యవసర సరుకుల వితరణ

– 16వ డివిజన్లో 1500 మందికి పంపిణీ – చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడ వరద ముంపు బాధితులకు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ శుక్రవారం నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. స్థానిక 16 డివిజన్లోని 1500 కుటుంబాలకు 25 కేజీల బియ్యం, గోధుమపిండి, పంచదార, ఆయిల్, పసుపు, ఉప్పు, కారం, కందిపప్పు లాంటి నిత్యవసరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ …

Read More »

కేరళ మీకు తోడుంటది

-విపత్తు పునరావృతం కాకూడదు -రాజకీయాలకి ఇది సమయం కాదు -సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, కేరళ ఎంపీ సంతోష్ కుమార్ -జాతీయ విపత్తుగా ప్రకటించాలి -నిధులిచ్చి ప్రజలకు అండగా నిలవండి -ప్రజల బాధలను కలిసి పరిష్కరిద్దాం -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ -ముంపు ప్రాంతాలలో పర్యటించిన సీపీఐ బృందం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ఐదు రోజులుగా విజయవాడ నగర ప్రజలు వరద ముంపులో ఇళ్ళు మునిగిపోయి బాధలు పడటం బాధ కలిగిస్తుందని, కేరళ మీకు తోడు ఉంటదని సీపీఐ …

Read More »

ముంపు బాధిత రైతులను ఆదుకోండి

-వరి, ఉద్యాన, వాణిజ్య పంటల రైతులకు అపారనష్టం -ఖరీఫ్‌ పంట రుణాల మాఫీకి చర్యలు -రాష్ట్రానికి ఆర్థిక సాయమందించాలి -రైతు సంఘాల సమన్వయ సమితి నేతలు వడ్డే, కేవీవీ, కేశవరావు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌కు వినతి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో పంట పొలాల ముంపునకు గురైన రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను రైతు సంఘాల సమన్వయ సమితి కోరింది. విజయవాడలోని వివంత్‌ హోటల్‌లో బస చేసిన కేంద్ర …

Read More »

ప్రజల రుణాల కాలపరిమితి రీ షెడ్యూల్ చేయాలి…

మచిలీపట్నం, సెప్టెంబర్ 6 జిల్లాలో వరద బాధిత ప్రాంత ప్రజల రుణాల కాలపరిమితి రీ షెడ్యూల్ చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బ్యాంకర్లకు సూచించారు. జిల్లాలో వరద పరిస్థితి సమీక్షించేందుకు శుక్రవారం కలెక్టరేట్ మీకోసం హాలులో బ్యాంకర్లతో జిల్లా సమన్వయ సంప్రదింపుల కమిటీ (DCC/DLRC) ప్రత్యేక సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో వరద పరిస్థితి సమీక్షించి, ఇప్పటివరకు జిల్లాలో తీసుకున్న సహాయ కార్యక్రమాలు సమీక్షించారు. జిల్లాలో 15 మండలాల్లో 62 గ్రామాలు వరద తాకిడికి గురి కాగా, …

Read More »