-విపత్తు పునరావృతం కాకూడదు
-రాజకీయాలకి ఇది సమయం కాదు
-సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, కేరళ ఎంపీ సంతోష్ కుమార్
-జాతీయ విపత్తుగా ప్రకటించాలి
-నిధులిచ్చి ప్రజలకు అండగా నిలవండి
-ప్రజల బాధలను కలిసి పరిష్కరిద్దాం
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
-ముంపు ప్రాంతాలలో పర్యటించిన సీపీఐ బృందం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత ఐదు రోజులుగా విజయవాడ నగర ప్రజలు వరద ముంపులో ఇళ్ళు మునిగిపోయి బాధలు పడటం బాధ కలిగిస్తుందని, కేరళ మీకు తోడు ఉంటదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, కేరళ ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో ముంపు ప్రాంతాల పర్యటన సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ వరద ముంపు పరిస్థితుల్లో మార్పు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. ప్రజల ఇబ్బందుల్లో ఉన్నారని, రాజకీయాలకిది సమయం కాదాని, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి మద్దతునివ్వాల న్నారు. ఇలాంటి విపత్తు పునరావృతం కాకూడదని ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ ప్రజలకు మనోధైర్యమిచ్చేలా అధికారుల కృషి బాగుందన్నారు.
అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ గత ఐదు రోజులుగా అన్ని వరద ముంపు మండలాలు, ప్రాంతాలు పర్యటించామని, ఆహారం, మంచినీటి కోసం చిన్న సందుల్లో ప్రజల పడుతున్న ఇబ్బందులు చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వరద నీరు కలుషితమై అనారోగ్యాలు ప్రభలే ప్రమాదం ఉందని, ఎన్నడూ లేని విపత్కర పరిస్థితి నేడు ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే దీనిని జాతి విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిధులు మంజూరు చేసి రాష్ట్ర ప్రజలకు అండగా నిలవాలని కోరారు. కృష్ణాజిల్లాలో లక్ష ఐదు వేల ఎకరాల పంట భూములు మునిగిపోయాయని తెలిపారు. ఇప్పటికే వేల కోట్ల పెట్టుబడులు పోయాయని, చిన్న వ్యాపారస్తులు నష్టపోయారని, ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల బాధలను పరిష్కరించేందుకు రాజకీయాల కతీతంగా పనిచేయాలని టీడీపీ, వైసిపి పార్టీలు కలిసి రావాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా విజయవాడ ముంపు నగరాన్ని పర్యటించాలని కోరారు.
గన్నవరం విమానాశ్రయంలో ఎంపీ సంతోష్ కుమార్ కు పుష్పగుచ్చాలతో స్వాగతించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అక్కినేని వనజ, జి ఈశ్వరయ్య, జి ఓబులేసు, కే వి వి ప్రసాద్ బృందం. కేసరపల్లి, సవ్వారిగూడెం, అజిత్ సింగ్ నగర్, డాబా కోట్ల సెంటర్ ముంపు ప్రాంతాలను సీపీఐ నాయకుల బృందం పర్యటించారు. పర్యటన బృందానికి పుష్ప గుచ్చాలతో స్వాగతించి, వసతి, భోజన ఏర్పాట్లు చేసిన ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, టీ తాతయ్య, కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, విశాలాంధ్ర విజ్ఞాన సమితి నేత టి మనోహర్ నాయుడు, కోల్డ్ రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పి జమలయ్య, ఇస్కస్ రాష్ట్ర నాయకులు ఎం సుబ్బారావు, బి రాయప్ప, వ్యవసాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు, కృష్ణాజిల్లా కార్యదర్శి ఏ ప్రసాద్, నగర సహాయ కార్యదర్శి నక్క వీరభద్రరావు, నాయకులు మూలి సాంబశివరావు, కె.వి భాస్కరరావు, తాడి పైడయ్య, కొట్టు రమణ, కంచర్ల నాగేశ్వరరావు, ఎస్ కే భాష, అప్పరబోతు రాము, ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు పరుచూరి రాజేంద్ర, లెనిన్ బాబు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు, నాయకులు లంక గోవిందరాజులు, ఎం సాయి కుమార్, ఎస్ కే సుభాని, మరియదాస్, అలీ, కార్తీక్, తదితరులున్నారు.
Prajavartha Online Telugu News