వరద బాధితులకు నిత్యవసర సరుకుల వితరణ


– 16వ డివిజన్లో 1500 మందికి పంపిణీ
– చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడ వరద ముంపు బాధితులకు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ శుక్రవారం నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. స్థానిక 16 డివిజన్లోని 1500 కుటుంబాలకు 25 కేజీల బియ్యం, గోధుమపిండి, పంచదార, ఆయిల్, పసుపు, ఉప్పు, కారం, కందిపప్పు లాంటి నిత్యవసరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ ను వరద ప్రభావితం చేసింది అన్నారు. ఆరోగ్యం, ఫుడ్ పరంగా బాధితులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాలని ముఖ్యమంత్రి సూచించారని, సీఎం ఆదేశాలతో ప్రజా ప్రతినిధులు, అధికారులు సహాయం అందిస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో సీఎం చంద్రబాబు సహాయక చర్యలు అందిస్తున్నారని తెలిపారు. ఇలాంటి సమయంలో బాధితులకు తామున్నామని టిడిపి ప్రభుత్వం తరపున తాము కూడా సహాయక చర్యల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలోపల్లెంటి సునీల్ చౌదరి ( చిత్తూరు అబ్జర్వర్), ముత్తు రవి, రత్న రమేష్ ( టిడిపి 16వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు), టిడిపి నేత గద్దె క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *