సీఎం ఆదేశాలతో ప్రజలకు అందుబాటులో ఇసుక సమాచారం

-28 ఇసుక నిల్వ కేంద్రాలలో 14,35,957 మెట్రిక్ టన్నుల ఇసుక
-రాష్ట్ర గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్టంలో అందుబాటులో ఉన్న ఇసుక వివరాలను ప్రతి రోజు ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామని వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, గనులు, ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సీఎం సూచనల మేరకు బుకింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో ఇసుక నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. వర్షాకాలం ముగిసిన తురువాత ఇసుక నిల్వలకు కొరత ఉండబోదన్నారు. వర్షాలు తగ్గి, రవాణా పరిస్ధితులు మెరుగైన తరువాత వివిధ రీచ్ ల నుండి పూర్తి స్ధాయిలో సరఫరా అందుబాటులోకి వస్తుందన్నారు. శనివారం నాటికి 28 ఇసుక నిల్వ కేంద్రాలలో 14,35,957 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందన్నారు. శుక్రవారం 12,893 మెట్రిక్ టన్నుల ఇసుక కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,009 మంది ధరఖాస్తు చేసుకోగా, 952 ధరఖాస్తుదారులకు 11,739 మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేసామన్నారు. కొన్ని చోట్ల అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వినియోగదారులు తమవంతు సహకారం అందించాలని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *