Breaking News

పర్యావరణహిత వినాయక చవితి వేడుకలకు కంకణబద్దులు కావాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మట్టి గణపతే మహా గణపతి అ ని ప్రతి ఒక్కరూ పర్యావరణహిత వినాయక చవితి వేడుకలకు కంకణబద్దులు కావాలని , ప్రధానంగా యువత కాలుష్యరహిత పండుగల నిర్వహణలో ముందుభాగాన ఉండాలని గుంటూరు నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శుక్రవారం ఒక ప్రకటన లో కోరారు. ఈ సందర్భంగా కమీషనర్ గుంటూరు నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ…నగర ప్రజలనిద్దేశించి మాట్లాడుతూ వివిధ రకాల రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసే విగ్రహాల వల్ల ఏర్పడిన కాలుష్యంతో పర్యావరణానికి పెను ముప్పు వాటిళ్లుతోందన్నారు. మన భక్తి వల్ల మరొకరికి ముప్పు వాటిల్లడం మంచిది కాదని ప్రతి ఒక్కరూ ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. కనుక వినాయక చవితి పండుగను పర్యావరణ హితంగా జరుపుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణంను అందించగలమని పేర్కొన్నారు. యువత పర్యావరణానికి ప్రమాదం వాటిల్లని విధంగా పండుగలు జరుపుకోవడంలో ముందుకు రావాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *