Breaking News

Daily Archives: September 29, 2024

మణిపాల్ హాస్పిటల్ వారిచే నిర్వహించబడిన పల్మనాలజీ, రుమటాలజీ మరియు అంటువ్యాధులపై సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2024 వైద్యరంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిల్లో పల్మనాలజీ, రుమటాలజీ మరియు అంటువ్యాధులు చాలా ముఖ్యమైనవి. వీటి వైద్య విధానంలో వచ్చిన అనేక మార్పుల వలన ఈ వ్యాధుల రోగుల జీవితాలు మెరుగుపడ్డాయి. ఊపిరితిత్తుల వ్యాధులలో ముఖ్యంగా కోవిడ్-19 తదనంతరం తలెత్తిన సమస్యలపై మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ వారు ఈరోజు విజయవాడ నొవాటెల్ హోటల్ నందు “లంగ్ మ్యాట్రిక్స్” సదస్సును నిర్వహించారు. ఈ సమావేశాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. డా. లోకేష్ …

Read More »

ఆరోగ్యకరమైన హృదయం.. ఆనందకరమైన జీవితం

-గుండె సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగివుండాలి -వాక్ ఫర్ హార్ట్ ప్రారంభ సందర్భంగా డీసీపీ ఎం. కృష్ణమూర్తి నాయుడు -కార్డియలాజికల్ సొసైటీ ఏపీ చాప్టర్ ఆధ్వర్యంలో 5కె వాకథాన్ -వాక్ ఫర్ హార్ట్.. లవ్ యు ఆంధ్రప్రదేశ్.. కార్యక్రమానికి విశేష స్పందన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యకరమైన హృదయంతో ఆనందకరమైన జీవితం సాధ్యమవుతుందని డీసీపీ ఎం. కృష్ణమూర్తి నాయుడు అన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా, కార్డియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ నిర్వహించిన వాక్ ఫర్ …

Read More »

బాలకార్మిక ,భిక్షాటన రహిత తిరుమల గా తీర్చదిద్దుదాం… : రాష్ట్ర బాలల హక్కుల కమిషన్

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమలలో బాలకార్మికులు, భిక్షాటన లేకుండా సంబంధిత అధికారులు అందరూ సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ కేసలి అప్పారావు, సభ్యులు ట్రిపర్ణ ఆదిలక్ష్మి మరియు బత్తుల పద్మావతి పేర్కొన్నారు. తిరుమలలో ముఖ్యమైన వీధుల్లో దుకాణాల్లో,హోటల్స్ లో బాలకార్మికులను మరియు భిక్షాటన చేస్తూ ఉన్న బాలలను గుర్తించడం వారి ఈ పరిస్థితులకు గల కారణాలపై ఆరా తీయడం జరిగింది. వీరిలో ఎక్కువుగా తమిళనాడు కొంతమంది కర్ణాటక మరియు ఒడిస్సా నుండి …

Read More »

ముఖ్యమంత్రి కార్యక్రమం ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు… : జిల్లా కలెక్టర్ డా. జి. సృజన

విజ‌య‌వాడ,  నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులకు ఆర్థిక సహాయానికి సంబంధించి ఖాతాల్లో నగదు జమకాని వారికి నేరుగా సాయం అందించేందుకు గౌరవ ముఖ్యమంత్రి సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇప్పటికే 90 శాతం మేర నగదు జమ చేయడం జరిగిందని.. మిగిలిన వారికి బ్యాంకు ఖాతాలు సరిగా లేనందువలన పెండింగ్లో ఉందని, ఖాతాలు …

Read More »

ఎక్స్చేంజ్ టూర్ల‌కి ఎసిఏ క్రికెట‌ర్లను పంపించాల‌ని కోరిన ఎసిఏ అధ్య‌క్షుడు, ఎంపి కేశినేని శివ‌నాథ్

-జాతీయ క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవానికి హాజ‌రు విజ‌య‌వాడ,  నేటి పత్రిక ప్రజావార్త : ఎసిఏ నుంచి నైపుణ్యం గ‌ల ముగ్గురు ఉత్త‌మ‌ క్రికెట‌ర్స్ ను అంతర్జాతీయ అనుభవం పొందేందుకు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా దేశాలకు ఎక్స్చేంజ్ టూర్లకు పంపించే ప్ర‌తిపాద‌న‌ను భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు దిలీప్ వెంగ్‌సర్కార్ ముందుకి ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు (ఎసిఏ),విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) తీసుకువెళ్ల‌టం జ‌రిగింది. బెంగ‌ళూరులో ఆదివారం జ‌రిగిన‌ జాతీయ క్రికెట్ అకాడ‌మి ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి ఎసిఏ అధ్య‌క్షుడిగా ఎంపి …

Read More »

ఈ నెల 30వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) నిర్వహిస్తాం

-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 30వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) …

Read More »

బదిలీ అయిన విద్యుత్ శాఖ ఈ ఈ భాస్కర్ రావుకు యోగ సభ చే ఘన సన్మానం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : యోగా సభ్యులు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మన్నెం భాస్కర రావు మచిలీపట్నం నుంచి మాచర్లకు బదిలీ పై వెళుతున్న సందర్భంగా ఆదివారం*యోగ సభ ఘనంగా సన్మానించింది. ఆదివారం ఉదయం నగరంలోని ఉదయపు నడక మిత్రమండలి భవనంలో ఉచిత యోగా శిక్షణ తరగతులు అనంతరం యోగా గురువులు గురునాధబాబు, చింతయ్య, యోగ సాధకులు సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ యమ్. వెంకటేశ్వర ప్రసాద్, సీనియర్ జర్నలిస్టు ముదిగొండ శాస్త్రి మాట్లాడుతూ విద్యుత్ శాఖ ఈ ఈ భాస్కర …

Read More »

ఉచిత పరీక్షలు బీపీ, షుగర్ పరీక్షలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం ఉదయం మచిలీపట్నం ఉదయపు నడక మిత్ర మండలి భవనంలో యోగాసభ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. యోగా శిక్షణ తరగతులు అనంతరం వైద్యులు డాక్టర్ జిజిఎల్ శ్రావ్య యోగ సాధకులకు ఉచితంగా బిపి , షుగర్ పరీక్షలు చేశారు. అవసరమైన వారికి వైద్య సలహాలు, సూచనలు చేశారు. యోగా సభ్యులు, ఇతరులు తో సహా 70 మంది సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నారు. యోగా గురువులు గురునాథ బాబు మహాలక్ష్మి చింతయ్య, సీనియర్ …

Read More »

రాష్ట్రంలో రౌడీ రాజ్యం.. పరాకాష్టకు చేరిన కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు : మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రౌడీల రాజ్యం నడుస్తోందని.. కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు పరాకాష్టకి చేరాయని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ఈ మేరకు ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. చంద్రబాబు అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రజా సమస్యలు …

Read More »

6 లక్షల రూపాయల సీఎంఆర్ ఎఫ్ చెక్కును బాధితులకు అందజేసిన మంత్రి నాదెండ్ల

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలిలోని క్యాంపు కార్యాలయంలో చావావారిపాలెం గ్రామస్తుడు బొడ్డు కిరణ్ కుమార్ ఊపిరితిత్తులు, హృదయ సంబంధిత వ్యాధితో ఇబ్బందిపడుతున్నారు అని తెలిసి చికిత్స కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF) ద్వారా 6,00,000 రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు.. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.

Read More »