Breaking News

బదిలీ అయిన విద్యుత్ శాఖ ఈ ఈ భాస్కర్ రావుకు యోగ సభ చే ఘన సన్మానం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
యోగా సభ్యులు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మన్నెం భాస్కర రావు మచిలీపట్నం నుంచి మాచర్లకు బదిలీ పై వెళుతున్న సందర్భంగా ఆదివారం*యోగ సభ ఘనంగా సన్మానించింది. ఆదివారం ఉదయం నగరంలోని ఉదయపు నడక మిత్రమండలి భవనంలో ఉచిత యోగా శిక్షణ తరగతులు అనంతరం యోగా గురువులు గురునాధబాబు, చింతయ్య, యోగ సాధకులు సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ యమ్. వెంకటేశ్వర ప్రసాద్, సీనియర్ జర్నలిస్టు ముదిగొండ శాస్త్రి మాట్లాడుతూ విద్యుత్ శాఖ ఈ ఈ భాస్కర రావు భారీ వర్షాల సమయంలో విధినిర్వహణలో నిద్రాహారాలు మాని, *అవిశ్రాంతంగా పని చేస్తూ నిరంతరం విద్యుత్ సరఫరా కోసం విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఎంత పని ఒత్తిడి ఉన్న క్రమం తప్పకుండా యోగా శిక్షణ తరగతులకు రావడం గొప్ప విశేషం అన్నారు ఈ కార్యక్రమంలో తమ్మన సూర్యనారాయణ,పశుసంవర్ధక శాఖ అధికారి జేవి రమణ, మహాలక్ష్మి, రాజకుమారి, ఆర్ డి ప్రసాద్ తదితర యోగా సభ్యులు అందరూ భాస్కర్ రావును అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *