మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివారం ఉదయం మచిలీపట్నం ఉదయపు నడక మిత్ర మండలి భవనంలో యోగాసభ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. యోగా శిక్షణ తరగతులు అనంతరం వైద్యులు డాక్టర్ జిజిఎల్ శ్రావ్య యోగ సాధకులకు ఉచితంగా బిపి , షుగర్ పరీక్షలు చేశారు. అవసరమైన వారికి వైద్య సలహాలు, సూచనలు చేశారు. యోగా సభ్యులు, ఇతరులు తో సహా 70 మంది సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నారు. యోగా గురువులు గురునాథ బాబు మహాలక్ష్మి చింతయ్య, సీనియర్ జర్నలిస్టు ముదిగొండ శాస్త్రి, యోగా సాధకులు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్ రావు,సమాచార శాఖ ఉప సంచాలకులు, యమ్ వెంకటేశ్వర ప్రసాద్, పశుసంవర్ధక శాఖ అధికారి జై విరమణ, తమ్మన సూర్యనారాయణ , ఆర్ డి ప్రసాద్ తదితర యోగా సభ్యులు అందరూ వైద్యులు డాక్టర్ జి జి ఎల్ శ్రావ్యను ఘనంగా సన్మానించారు. చిన్న వయసులోనే సేవా కార్యక్రమాలు చేస్తున్న డా.శ్రావ్య కి భగవంతుని ఆశీస్సులు తో ఉజ్వల భవిష్యత్తు కలగాలని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి జీవితం లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదించారు.
Prajavartha Online Telugu News