Breaking News

Daily Archives: October 7, 2024

ప్రజలకు ఉచిత ఇసుక అందించడమే ప్రభుత్వ లక్ష్యం

-తక్కువ ధరకే నాణ్యమైన మద్యం సరఫరా -మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు -మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు ఉచిత ఇసుక అందించాలనే లక్ష్యంతో జూలై 8 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెచ్చిందని, అక్టోబర్ 16 నుంచి పూర్తిస్థాయిలో వినియోగదారులకు ఉచిత ఇసుకను అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం మంత్రి నగరంలోని రహదారులు భవనాల అతిథుల గృహంలో …

Read More »

ప్రధాని మోదీ, అశ్వినీ వైష్ణవ్ తో సీఎం చంద్రబాబు భేటీ

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి చెందిన కీలక అంశాలపై దాదాపు గంటపాటు ఆయన. ప్రధానికి వివరించారు. ఇటీవల భారీ వర్గాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేయగా, బుడమేరు పొంగి విజయవాడను ముంచెత్తింది. బుడమేరు వరదల పై నివేదిక ఇచ్చిన తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అయిన సీఎం చంద్రబాబు పరధలకు నష్టపోయిన రాష్ట్రానికి మరిన్ని నిధులు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ పసులు తిరిగి ప్రారంభించాలని, మరో సీజన్ నష్టపోకుండా సనంబర్లో …

Read More »

వరద నిధుల దుబారాపై మల్లాది విష్ణు మండిపాటు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులు పూర్తిగా కోలుకునేలా చేయూతనందించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. దాతల నుంచి చెక్కుల సేకరణకు కేటాయించిన సమయంలో సగం సమయం కూడా సహాయక చర్యలపై పెట్టకపోవడంతో.. 16 డివిజన్లు పూర్తిగా నీటమునిగాయన్నారు. చివరకు ఎన్యుమరేషన్లో లోపాల కారణంగా ప్రతి సచివాలయ పరిధిలో సగానికి పైగా బాధితులు సాయం అందక మిగిలిపోయింది వాస్తవం కాదా..? అని మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థత వల్ల …

Read More »

గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి తూర్పు నియోజకవర్గ వైసీపీ శ్రేణులతో సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్.జిల్లా వైసీపీ కార్యాలయం లో తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్పొరేటర్లు,కో ఆప్షన్ సభ్యులు, ఇంచార్జ్ లు,డివిజన్ ప్రెసిడెంట్లు తో సమావేశం అయిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ అభ్యర్థి పునూరు గౌతమ్ రెడ్డి, రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు.. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ కి సంబంధించి ఓటర్ల నమోదు …

Read More »

జిల్లా ఖనిజాల ఫౌండేషన్ నిధుల వినియోగం పై సమావేశం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో అసంపూర్తిగా నిలిచిపోయిన అంగన్వాడి, వసతి గృహాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,పాఠశాల భవనాల నిర్మాణానికి జిల్లా ఖనిజాల ఫౌండేషన్ నిధులను (డి ఎం ఎఫ్) తొలి ప్రాధాన్యతగా వినియోగించాలని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు. సోమవారం సాయంత్రం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర మంత్రి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తో కలిసి జిల్లాలోని శాసనసభ్యులతో జిల్లా ఖనిజాల ఫౌండేషన్ నిధుల వినియోగం పై సమావేశం …

Read More »

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి

-దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కె. రామచంద్ర మోహన్ నియామకం -కీలకమైన చివరి 4 రోజుల పర్యవేక్షణ బాధ్యతలు -దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ కనకదుర్గ దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలకు దేవాలయ శాఖ అదనపు కమిషనర్ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ను స్పెషల్ ఆఫీసర్ గా నియమించారు. ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోమవారం అదేశాలు ఇచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో కీలకమైన చివరి నాలుగు రోజుల్లో భక్తులకు …

Read More »

రూ.290 కోట్లతో రాష్ట్ర రహదారులకు మరమ్మతులు

-తొలి దశలో 1393 రోడ్లకు 7071 కి.మీ మేర మరమ్మతులు -వరదలతో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు రూ. 186 కోట్లు విడుదల -రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి వెల్లడి -రహదారుల నిర్వహణపై SRM వర్సిటీలో ఆర్ & బీ శాఖ ఆధ్వర్యంలో వర్క్ షాప్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మెరుగైన రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి బీసీ జనార్థన్ …

Read More »

టమాటా, ఉల్లి ధరల పెరుగుదల నియంత్రణకు కృషి

-మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లకు సరఫరా -సాధారణ ధరలకు విక్రయించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో టమాటా, ఉల్లి ధరల పెరుగుదల నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. టమాటా, ఉల్లి ధరల పెరుగుదల అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఉద్యాన శాఖ కార్యదర్శి అహ్మద్ బాబు, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీత, సంబంధిత అధికారులతో సోమవారం సచివాలయంలో …

Read More »

వన్య ప్రాణుల రక్షణ మనిషి బాధ్యత

-వసుధైక కుటుంబంలో సమస్త జీవ కోటి ఉంది -పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు చెబుతున్నది ఇదే -మనపై ఆధారపడిన జీవుల్ని రక్షిస్తేనే మానవ మనుగడ -పర్యావరణ పరిరక్షణ, వన్య ప్రాణుల సంరక్షణపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి -మంగళగిరిలో అరణ్య భవన్ లో నిర్వహించిన వన్య ప్రాణి వారోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘వసుధైక కుటుంబంలో సమస్త జీవ కోటికి చోటు ఉంది. వాటిలో మనిషి ఒకడు. మనకున్న సాంకేతికత, విజ్ఞానంతో ఇతర జీవ రాశుల …

Read More »

‘మాక్సివిజన్‌ ఐ హస్పటల్‌’లో అత్యాధునిక స్మైల్‌ 500 టెక్నాలజీ సేవలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కంటి చికిత్సలో ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీలు అందుబాటులోకి తీసుకువస్తూ ప్రజలకు వైద్యం అందిస్తున్న ‘మాక్సివిజన్‌ ఐ హస్పటల్‌’ యాజమాన్యాన్ని అభినందిస్తున్నానని సెంట్రల్‌ ఎమ్యేల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. బందర్‌ రోడ్డులోని మాక్సివిజన్‌ ఐ హస్సటల్‌నందు అత్యాధునిక స్మైల్‌ 500 టెక్నాలజీ సేవలను సోమవారం డాక్టర్‌ కాసు ప్రసాద్‌ రెడ్డి, మాక్సివిజన్‌ గ్రూప్‌ సిఈఓ వీ.ఎస్‌.సుధీర్‌లతో కలిసి బోండా ఉమా ప్రారంభించారు. అనంతరం డాక్టర్‌ కాసు ప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ స్మైల్‌ 500 టెక్నాలజీని ప్రవేశపెట్టడం రెఫ్రాక్టివ్‌ శస్త్ర …

Read More »