Breaking News

Daily Archives: October 27, 2024

అనధికార లే అవుట్స్ పై ఉక్కుపాదం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార వెంచర్లు, లే అవుట్స్ ఉండడానికి వీలు లేదని, అటువంటి వాటిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి తొలగిస్తామని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  స్పష్టం చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఆదివారం నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక అధికారులు ఆర్.టి.ఓ.ఆఫీస్ రోడ్, సీతయ్య డొంక రోడ్లలోని అనధికార లే అవుట్స్ లో ఏర్పాటు చేసిన హద్దు రాళ్లు, బోర్డ్ లు, రోడ్లను 3 జేసిబిలతో పూర్తి స్థాయిలో తొలగించారు. …

Read More »

గోశాలలో ఆవులకు మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ గోశాలలో ఆవులకు మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. ఆదివారం వెంగళాయపాలెంలోని జిఎంసి గోశాలను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో రోడ్ల మీద ట్రాఫిక్ కు అంతరాయం కల్గించే ఆవులు, ఎద్దులు, పశువులను గోశాలకు …

Read More »

శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 28 నుంచి 30వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా 28న పవిత్రప్రతిష్ఠ, అక్టోబరు 29న మూలవర్లకు, ఉత్సవర్లకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి, శ్రీ ఆంజనేయస్వామి వారికి పవిత్రాలు సమర్పణ నిర్వహిస్తారు. అక్టోబరు 30న రాత్రి పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి . …

Read More »

అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోండి

-సీడీపీవోలు జి. మంగమ్మ, టి. నాగమణి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని ఐసిడిఎస్ ప్రోజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, మిని అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ సహాయకురాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని అర్హులైన అభ్యర్థులు ఉద్యోగ నియామకానికి దరఖాస్తు చేసుకోవాలని విజయవాడ రూరల్ మరియు అర్బన్ ప్రోజెక్టుల సీడీపీవోలు జి. మంగమ్మ, టి. నాగమణి లు ప్రకటనలో కోరారు. జిల్లాలోని విజయవాడ (రూరల్) ప్రాజెక్ట్ పరిధిలో రాయనపాడు 3 నందు ఎస్సీ కేటగిరి, …

Read More »

ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ వద్దు

-ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేయాలి -రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామ పంచాయతీల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడకూడదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్  అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీతోపాటు 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు వచ్చిన క్రమంలో వాటిని సక్రమంగా, …

Read More »

జిల్లాలో లైసెన్సు కల్గిన వారు మాత్రమే ప్రభుత్వ నియమ నిబంధలనకు లోబడి బాణసంచా తయారీ లేదా విక్రయాలు చేయాలి…

-తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ -బాణసంచా నిల్వలు, తయారీ, విక్రయాలకు అనుమతులు తప్పనిసరి -జిల్లాలో అక్రమంగా బాణసంచా తయారీ, సరఫరా, విక్రయాలు చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు -ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా జనసంచార స్థలాల్లో లేదా అనుమతులు లేకుండా విక్రయాలు జరిపిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం -తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దీపావళి పండుగ వస్తున్న నేపథ్యంలో బాణసంచా ప్రేలుళ్ళు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు …

Read More »

మంత్రి  అనగాని సత్యప్రసాద్ తిరుపతి జిల్లా రాక!

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆం.ప్ర రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి మరియు తిరుపతి జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 28 మరియు 29 తేదీల్లో తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28న సోమవారం మధ్యాహ్నం 01.05 గం.లకు మంత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారని, అనంతరం తిరుపతి పట్టణంలో స్థానిక కార్యక్రమాలలో పాల్గొని రాత్రి …

Read More »

అన్నా క్యాంటీన్‌కు రూ.లక్ష విరాళం ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌కు అందచేసిన దాతలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదల ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్‌ నిర్వహణ కోసం లక్ష రూపాయల విరాళం అందచేయడం అభినందనీమయని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు. వజ్జే రవికుమార్, వజ్జే శ్రీదేవి మనువరాలు దోనేపూడి అశ్వని నూతన వస్త్రాలంకరణ వేడుక సందర్భంగా అన్నా క్యాంటీన్‌ నిర్వహణ నిధికి రూ.లక్ష చెక్కును ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌కు ఆదివారం అందచేశారు. స్థానిక 24కే ఫంక్షన్‌ హాలులో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ హజరై అశ్వనీ ని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా …

Read More »

“ప్రతిభ ప్రదర్శించి పతకాలతో క్రీడాకారులు తిరిగి వెళ్ళండి”

-యం.ఎల్.ఎ గద్దే రామ్మోహన్  విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతిభ ప్రదర్శించి పతకాలతో తిరిగి వెళ్లాలని క్రీడాకారులకు విజయవాడ తూర్పు నియోజక వర్గ శాసన సభ్యులు గద్దే రామ్మోహన్ సూచించారు. 68 వ ఆంధ్రప్రదేశ్ అంతర జిల్లాల పాఠశాల క్రీడా సమాఖ్య అండర్ -19 బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలను కృష్ణ లంక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం నాడు ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి పోటీలను ప్రారంభించి అనంతరం మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన సభకు విజయవాడ డి.వి. ఇ.ఓ సి.యస్.యస్ …

Read More »

తోటి వారికి సహాయం చేసే గుణాన్ని అలవరచుకోవాలి

-మున్సిపల్ సిబ్బందికి దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : తోటి వారికి సహయం చేయడంలోనే నిజమైన ఆనందం దాగి ఉంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. ఏ మత గ్రంధంలోనైనా ఇదే విషయం ఉంటుందని అందువల్ల ప్రతి ఒక్కరూ వారికి చేతనైనంత సహాయం పోరుగు వారికి చేయాలని ఆయన చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీ రెండో రోడ్డులో జయభారత్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ పవన్ కుమార్ …

Read More »