-2 గిన్నిస్ రికార్డుల సాధన -దీపావళిని పురస్కరించుకొని అయోధ్యలోని సరయూ నదీతీరంలో దీపోత్సవ కాంతులు అయోధ్య, నేటి పత్రిక ప్రజావార్త : బాలరాముడు కొలువుదీరిన అయోధ్యలో బుధవారం రాత్రి దీపావళి సంబరాలు కనులపండువగా జరిగాయి. గత ఎనిమిదేళ్లుగా సరయూ నదీతీరంలో దీపోత్సవం నిర్వహిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఈసారి కూడా అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేసింది. బాలరాముణ్ని దర్శించుకొన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా దీపాలు వెలిగించి ఉత్సవాన్ని ప్రారంభించారు. మొత్తం 55 ఘాట్లలో భక్తులు 25 లక్షలకు పైగా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించారు. …
Read More »Daily Archives: October 31, 2024
టీటీడీ ఛైర్మన్ బి.ఆర్ నాయుడుకి, పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు
మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) నూతన చైర్మన్ గా నియమితులైన టీవీ 5 అధినేత, ప్రముఖులు బొల్లినేని రాజగోపాల నాయుడు (బి.ఆర్ నాయుడు) కి, పాలక మండలి సభ్యులకు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు గురువారం ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. సామాన్య రైతు కుటుంబానికి చెందిన బీఆర్ నాయుడు తితిదే బోర్డు ఛైర్మన్ గా, టీటీడీ బోర్డుకు తిరిగి వారి హయాంలో పూర్వ వైభవం తీసుకురావాలని, భక్తులకు అత్యున్నత స్థాయిలో మెరుగైన సేవలు …
Read More »అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష
మచిలీపట్నం, అక్టోబరు 31: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సాంఘిక మరియు గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యములో రాష్ట్ర వ్యాప్తముగా ఎస్.సి./ ఎస్.టి అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ విధానంలో DSC శిక్షణ ఇచ్చు నిమిత్తము అభ్యర్థుల ఎంపిక కొరకు ది. 03-11-2024వ తేదిన నిర్వహించవలసిన స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షాను ది. 10-11-2024 వ తేదిన నిర్వహించుటకు తేదిని మార్పు చేయుట జరిగినది. అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షా ఆన్ లైన్ మోడ్ లో మాత్రమే నిర్వహించబడుతుంది అని తెలియపరచటమైనది. కావున ఉచిత డిఎస్సి శిక్షణను తీసుకొనుటకు దరఖాస్తు …
Read More »ఆర్టీసీ హవుస్ లో సర్దార్ వల్లభ భాయ్ పటేల్ జయంతి వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రీయ ఏకతా దివస్ సందర్భంగా, దేశసేవలో తెగువ చూపి ఉక్కుమనిషిగా పేరు గాంచిన సర్దార్ వల్లభ భాయ్ పటేల్ జయంతి వేడుకను ఈ రోజు ఏపిఎస్ ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఆర్టీసీ హవుస్ నందు ఘనంగా నిర్వహించారు. సర్దార్ వల్లభ భాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భారతదేశ స్వాతంత్ర్యసమరంలోను స్వాతంత్ర్యానంతరం దేశసేవలో అడుగడుగునా ఆయన చూపిన తెగువ సాహసోపేతమైన నిర్ణయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. …
Read More »సమైక్యతా రన్ ను నిర్వహించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ సమైక్యతను మరియు సమగ్రతను చాటిచెప్పిన స్వాతంత్య్ర సమరయోధుడు, ఉక్కుమనిషి, దేశ ఐక్యతా వాది మరియు భారతదేశ తొలి ఉప ప్రధాన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ది.31.10.2024వ తేదీన జాతీయ సమైక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్) సందర్భంగా ఎన్.టి.ఆర్.జిల్లా నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు విజయవాడ బెంజ్ సర్కిల్ నుండి సిటీ ఆర్మడ్ గ్రౌండ్స్ వరకు సమైక్యతా రన్ ను నిర్వహించడం జరిగింది. ఈ …
Read More »సర్దార్ వల్లభాయ్ పటేల్ నేటి యువత కు ఆదర్శం… : షేక్ బాజీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు బిజెపి రాష్ట్ర కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి కి 560 సంస్థానాలు విలీనం కాకపోతే సర్థార్ వల్లభాయ్ పటేల్ కారణంగా భారతదేశం ఏక ఛత్రాధిపత్యానికి తీసుకుని వచ్చారు.నైజాం సంస్థానం వీలినం చేయడం లో పటేల్ పాత్ర అత్యంత ప్రశంసనీయం. భారతదేశాన్ని శక్తి వంతమైన …
Read More »ఏపీ రెవెన్యూ శాఖలో కాంట్రాక్ట్ పద్దతిలో 40 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ
-ఏపీ రెవెన్యూ శాఖలో కాంట్రాక్ట్ పద్దతిలో 40 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే విశాఖపట్నంలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. -దరఖాస్తు దాఖలు చేసేందుకు నవంబర్ 4 ఆఖరు తేదీగా నిర్ణయించారు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూపరిపాలన ప్రధాన కమిషనర్ 40 పోస్టులు భర్తీ చేసేందుకు ఆదేశించారు. అందులో ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్లు-13 కాగా, ఈ-డివిజనల్ మేనేజర్లు-27 ఉన్నాయి. కాంట్రాక్టు ప్రాతిపదికన కొత్తగా ఏర్పడిన రెవెన్యూ డివిజన్లకు …
Read More »అర్హులైన ప్రతి పాత్రికేయునికి నివేశన స్థలం
-మచిలీపట్నం ప్రెస్ క్లబ్ కు 5 సెంట్లు స్థలం కేటాయిస్తాం -మచిలీపట్నం మీడియా మిత్రుల ఆత్మీయ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మీడియా మిత్రులతో కలిసి క్రాకర్స్ కాల్చిన మంత్రి రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నియోజకవర్గంలో పని చేస్తున్న అర్హులైన ప్రతి జర్నలిస్టుకు నివేశన స్థలాలు ఇవ్వటంతోపాటు మచిలీపట్నం ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి 5 సెంట్ల స్థలం కేటాయిస్తానని రాష్ట్ర మైన్స్ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. దీపావళి సందర్భంగా గురువారం …
Read More »తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను ఇనుమడింపజేసేలా కృషి చేస్తా… : నన్నూరి నర్సిరెడ్డి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను ఇనుమడింపజేసేలా కృషి చేస్తానని టీటీడీ బోర్డు సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి తెలియజేశారు. బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు. పార్టీలో నన్ను అన్ని విధాలా ప్రోత్సహించి టీటీడీ బోర్డు సభ్యునిగా నియమించినందుకు తెలుగుదేశం పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటాను. భక్తులకు మెరుగైన సేవలు అందించేలా …
Read More »శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో శ్రీ జె.శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించిట్లు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్టు చెప్పారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆయురారోగ్య …
Read More »