తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను ఇనుమడింపజేసేలా కృషి చేస్తానని టీటీడీ బోర్డు సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి తెలియజేశారు. బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు. పార్టీలో నన్ను అన్ని విధాలా ప్రోత్సహించి టీటీడీ బోర్డు సభ్యునిగా నియమించినందుకు తెలుగుదేశం పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటాను. భక్తులకు మెరుగైన సేవలు అందించేలా బోర్డు సభ్యునిగా నా శాయశక్తులా కృషి చేస్తాను. నాకు సహకరించిన పార్టీ నాయకులకు, శ్రేణులకు, కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. తిరుమలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తాం. హిందూ సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తాం. శ్రీవారి ఆశీస్సులతో టీటీడీకి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు.
Tags tirupathi
Check Also
ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం (ఏబీపీ)పై అధికారులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
-పెనుగంచిప్రోలు ఇబ్రహీంపట్నం బ్లాక్ లను టాప్ టెన్ లో నిలపండి…. -హెల్త్ ,ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ పై దృష్టి సారించండి….. -కలెక్టర్ …