Breaking News

Monthly Archives: October 2024

ఖరీఫ్ ధాన్యం తొలి ధాన్యం కొనుగోలు సొమ్ము చెల్లింపు

-కోనుగోలు చేసిన 48 గంటల్లోగా రైతు ఖాతాకు జమ -జెసి చిన్న రాముడు నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి 2024-25 ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి కోనుగోలు చేసిన ధాన్యం సొమ్మును 48 గంటల్లోగా రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలలోకి వెళితే నల్లజర్ల మండలం ప్రకాశరావు పాలెం రైతు సేవా కేంద్రం లో ఏర్పాటు చేసిన ధాన్యం …

Read More »

పీపుల్స్ తహసీల్దార్ గా రెవిన్యూ అధికారి పనితీరు ఉండాలి

-తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం లభిస్తుందన్న నమ్మకం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి -ఇకపై రెవిన్యూ అధికారుల సమావేశంలో డివిజన్ స్థాయిలో నిర్వహిస్తాం -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏదైనా ఒక అర్జీ పరిష్కారం కోసం వేచి ఉండే ధోరణితో కాకుండా, సమయానుకూలంగా ప్రవర్తించే తీరును బట్టి అర్జిదారుడు సంతృప్తి స్థాయి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టర్ కార్యాలయ దృశ్య మాధ్యమ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి రెవిన్యూ అధికారుల సమావేశంలో నిర్వహించారు. …

Read More »

త్వరలో చేనేత సహకార సంఘ ఎన్నికలు

-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత -ఎన్నికల హామీల అమలుకు కట్టుబడిన ఉన్న సీఎం చంద్రబాబు -ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించండి -సమీక్షలో మంత్రి సవిత ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : త్వరలో చేనేత సహకార సంఘ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. దీనిలో భాగంగా నూతన సహకార సంఘాలను ఏర్పాటు చేయడంతో పాటు నిద్రాణస్థితిలో ఉన్న సంఘాలను బలోపేతం చేయాలని మంత్రి ఆదేశించారు. మంగళగిరిలోని హ్యాండ్లూమ్, టెక్స్ టైల్స్ కమిషనరేట్ …

Read More »

భేటీ బచావో – భేటీ పడావో పైన జిల్లా స్థాయి సమావేశము

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ, తిరుపతి వారి అద్వర్యంలో, కలెక్టరేట్ నందు గల సమావేశ మందిరం, తిరుపతి నందు భేటీ బచావో అండ్ భేటీ పడవో (బాలికను రక్షించండి – బాలికను చదివించండి) పై జిల్లా స్థాయి అధికారులతో డిస్ట్రిక్ట్ రెవిన్యూ అధికారి పెంచల కిశోర్ గారి ఆధ్వర్యములో శక్తీ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమములో డిస్ట్రిక్ట్ రెవిన్యూ ఆఫీసర్ మాట్లాడుతూ శిశు లింగ నిష్పత్తిని పెంచడం, లింగ వివక్షతను లేకుండ …

Read More »

బాలాయ పల్లి తాసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

-మండల తాసిల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి -పిజిఆర్ఎస్ అర్జీలను అర్థవంతంగా నాణ్యతగా నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మండల తాసిల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పిజిఆర్ఎస్) అర్జీలను అర్థవంతంగా నాణ్యతగా నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం బాలాయపల్లి …

Read More »

సహకార చట్ట పరిధిలో ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలి…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల సహకార పరపతి సంఘా నికి ఈనెల 28 వ తేదీన ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఎన్నికలకు సంబదించి శిక్షణా కార్యక్రమo కలక్టరేట్లో జిల్లా సహకార అధికారిణి లక్ష్మి అధ్యక్షతన జరిగింది. లక్ష్మి మాట్లాడుతూ సహకార చట్ట పరిధిలో ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలని కోరారు. కార్యక్రంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ నాగభూషణం ఎన్నికలకు సంబదించిన నియమ నిబధనలను విపులముగా వివరించారు. ఎన్నికల అధికారి యం ఉమాపతి …

Read More »

వైద్యులు ఆసుపత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్యం బాధ్యతగా అందించాలి

-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ -డక్కిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుల పనితీరు మెరుగుపడాలి… హెచ్చరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ డక్కిలి, నేటి పత్రిక ప్రజావార్త : వైద్యులు ఆసుపత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్యం బాధ్యతగా అందించాలనీ, డక్కిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుల పనితీరు మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ హెచ్చరించారు. బుధవారం మధ్యాహ్నం డక్కిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసారు. ముందుగా హాజరు పట్టికను పరిశీలించి …

Read More »

తిరుపతి జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటనలు

-అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు ఆట పాటలతో విద్య, ఆరోగ్యం పర్యవేక్షణ అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఎంతో అవసరం : జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వెంకటగిరి, నేటి పత్రిక ప్రజావార్త : అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు ఆట పాటలతో విద్యా, ఆరోగ్యం పర్యవేక్షణ ఎంతో అవసరం అని, అంగన్వాడి కేంద్ర పరిధిలోని ప్రీ స్కూలింగ్ బాల బాలికలకు, బాలింతల వారి సంక్షేమం సంబంధిత అంగన్వాడీ కార్యకర్తలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులదే అని అప్రమత్తంగా జాగ్రత్తగా వారిని చూసుకోవాలని జిల్లా కలెక్టర్ …

Read More »

పేదలకు ఆకలి తీర్చే ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ పేదలకు ఒక గొప్ప వరం

-నాణ్యమైన ఆహారం అతి తక్కువ ధరకే పేదలకు అందుబాటులో ఉంచి కడుపు నిండా పెడుతున్న ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు :జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ -కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతి… ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ లను అమలు చేసిన గొప్ప ముఖ్యమంత్రి మహా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు: ఎమ్మెల్యే కొరుగొండ్ల రామకృష్ణ వెంకటగిరి, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు నామ మాత్రపు ధరతో ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతమైన ఆశయానికి అనుగుణంగా ఎన్టీఆర్ అన్నా …

Read More »

అమ్మ‌వారి అనుగ్ర‌హం, సీఎం చంద్ర‌బాబు కృషి వ‌ల్లే ఐదు గిన్నిస్ రికార్డులు సొంతం : ఎంపి కేశినేని శివ‌నాథ్

-అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న కేంద్ర‌మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు -ఆల‌య మ‌ర్యాద‌ల‌తో ఈవో ఘ‌న స్వాగ‌తం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రి పై అమ్మవారి ఆశీస్సులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి వ‌ల్లే డ్రోన్ హాక్ థాన్ ఐదు గిన్నిస్ రికార్డులు న‌మోదు చేసుకుంద‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. ఇంద్రకీలాద్రి కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారిని కేంద్ర పౌర‌విమానాయ‌న శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ , అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ , మాడుగుల ఎమ్మెల్యే …

Read More »