-ప్రభంజనంలా భవానిలా రాక… -ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్ -డాక్టర్ జి. సృజన, నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు నిరంతర ప్రత్యక్ష పర్యవేక్షణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు రోజు ప్రారంభమైన భవానీ మాలధారుల ప్రభంజనం ఇంకా కొనసాగుతోంది. లక్షల సంఖ్యలో భవానీలు జై భవాని….. జై జై భవానీ…….నామ స్మరణతో ఇంద్రకీలాద్రి వైపు అడుగులేస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో సమానంగా భవానిమాల దీక్షధారుల సంఖ్య ఉండటంతో వారికి …
Read More »Monthly Archives: October 2024
ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లోని గ్రామీణ స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
-గ్రామీణాభివృద్ధికి గొప్ప ప్రోత్సాహం: రాజస్థాన్‌కు రూ.1267 కోట్లకు పైగా, ఆంధ్రప్రదేశ్‌కు రూ.988 కోట్లకు పైగా మొదటి విడత నిధులు విడుదల విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లోని గ్రామీణ స్థానిక సంస్థలకు (ఆర్‌ఎల్‌బీలు), 2024–25 ఆర్థిక సంవత్సరానికి, 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లలో మొదటి విడతను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ₹395.5091 కోట్ల షరతులు లేని నిధులు (అన్‌టైడ్ గ్రాంట్లు), ₹593.2639 కోట్లు షరతులతో కూడిన నిధులు (టైడ్ గ్రాంట్లు) విడుదలయ్యాయి. రాష్ట్రంలోని అర్హత గల 9 కార్పొరేషన్లు, …
Read More »కార్పొరేషన్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లేదు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం కార్పొరేషన్ ప్రధాన మరియు జోనల్ కార్యాలయాల్లో జరుగు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, అమ్మవారి దర్శనానికి వచ్చు భక్తజన సందోహం ఎక్కువగా ఉన్నందున, ఈ సోమవారం నిర్వహించడం లేదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు దీన్ని గమనించవలసిందిగా కోరారు.
Read More »అమ్మవారి భక్తులకు కల్పించే సౌకర్యాలలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోండి…
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం రాత్రి దసరా నవరాత్రులకు విజయవాడ నగరపాలక సంస్థ వారు చేసిన ఏర్పాట్లను సీతమ్మ వారి పాదాలు, హోల్డింగ్ ఏరియా, పరిసర ప్రాంతాలు మొత్తం పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక శాతంలో ఉండటం గమనించి, అక్కడనుండి దసరా నవరాత్రుల ఉత్సవ విధుల్లో ఉన్న ఫీల్డ్ అధికారులతో మాట్లాడేందుకు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలి కాన్ఫరెన్స్లో పారిశుద్ధ్య నిర్వాహణలో …
Read More »చివరి రోజు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో అంగరంగ వైభవముగా ప్రారంభమైన శ్రీ దుర్గామళ్లేశ్వర స్వామి వార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో బాగంగా చివరి రోజు అవ్వడంతో అమ్మవారి దర్శనం నిమిత్తం ఇరు రాష్ట్రల నుండి అధిక సంఖ్యలో భవాని భక్తులు రావడంతో పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఎక్కడా తొక్కిసలాట జరుగకుండా అమ్మవారి దర్శనం అయ్యేవిధంగా బందోబస్త్ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షస్తూ బందోబస్త్ అధికారులకు మరియు సిబ్బందికి అప్పటికప్పుడు సలహాలను సూచనలను అందించడం జరిగింది. …
Read More »అమ్మ వారి కి 10 లక్షల బంగారు హారం బహుకరించిన పంకజ్ రెడ్డి
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త పంకజ్ రెడ్డి, సరిత దంపతులు పది లక్షల రూపాయలు విలువైన బంగారు హారం అమ్మవారికి బహుకరించారు. వస్తు విలువను నిర్ధారించే… ధ్రువీకరణ పత్రం, హారం శనివారం ఆలయ కార్య నిర్వహణ అధికారి కె.ఎస్ రామారావుకు అందజేశారు. అనంతరం దాతలకి వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ పిఆర్ఓ డి వి వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read More »విపత్తు నుంచి విజయవంతమైన వేడుకలు
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల సంభవించిన వరద విపత్తు నుంచి విజయవంతంగా జరిగిన దసరా వేడుకలతో విజయవాడ నగరం ప్రకాశించిందని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. వరద విపత్తుతో ప్రజలందరి గుండెలు బరువెక్కాయని నేడు శరన్నవరాత్రుల వెలుగులతో విజయవాడ నగరం ప్రకాశించిందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ అవిశ్రాంత కృషి, దుర్గమ్మ చల్లని దీవెనలతో నగరవాసులకు స్వాంతన చేకూరిందన్నారు. విజయవాడ నగరం వరదల నుంచి కోలుకొని …
Read More »శ్రీ రాజరాజేశ్వరీ దేవి అవతార విశిష్టత…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున అమ్మవారు రాజరాజేశ్వరీ దేవిరూపంలో దర్శనమిస్తారు. శరన్నవరాత్రులలో ఆశ్వయుజ శుద్ధ దశమి(విజయ దశమి) రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవిరూపంలో దర్శనమిస్తుంది. నవరాత్రులలో ఈరోజే ఆఖరిరోజు. ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న కనకదుర్గ ఆలయంలో అమ్మవారు ఈ రూపంలో దర్శనమిస్తారు. ఈరోజును విజయదశమిగా అమ్మవారు చిద్రూపిణి. వరదేవతగా అలరారుతుంది. పరమేశ్వరుని అంకమును ఆసనముగా చేసుకుని, చేతిలో చెరకుగడతో, చిరుమందహాసంతో శోభాయమానమై ప్రకాశించే జగన్మాతను భక్తితో పూజించుకోవాలి. అనంత శక్తి స్వరూపిణి అయిన ఈ తల్లి …
Read More »సీఎం చంద్రబాబును కలిసి మెగాస్టార్ చిరంజీవి
-వరద సాయం కింద ఎపి సిఎం సహాయ నిధికి రూ.1 కోటి విరాళం అందజేత హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ప్రముఖ సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ఎపిలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన తరపున రూ.50 లక్షలు, హీరో రామ్ చరణ్ తరపున రూ.50 లక్షల విరాళం అందించారు. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే చిరంజీవి…వరద సాయం కింద రూ.1 కోటి అందించడంపై ముఖ్యమంత్రి …
Read More »సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ ద్వారా చేపట్టిన చర్యలపై రివ్యూ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సిఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. నిత్యావసర వస్తువుల ధరల భారం ప్రజలపై పడకుండా సివిల్ సప్లై శాఖ తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా సాధ్యమైనంత వరకు ప్రజలపై నిత్యావసరాల భారం పడకుండా చూడాలని సిఎం అధికారులకు సూచించారు. డిమాండ్-సప్లై మధ్య వ్యత్యాసానికి గల కారణాలను విశ్లేషించి …
Read More »