Breaking News

అమ్మవారి భక్తులకు కల్పించే సౌకర్యాలలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోండి…

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం రాత్రి దసరా నవరాత్రులకు విజయవాడ నగరపాలక సంస్థ వారు చేసిన ఏర్పాట్లను సీతమ్మ వారి పాదాలు, హోల్డింగ్ ఏరియా, పరిసర ప్రాంతాలు మొత్తం పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.  అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక శాతంలో ఉండటం గమనించి, అక్కడనుండి దసరా నవరాత్రుల ఉత్సవ విధుల్లో ఉన్న ఫీల్డ్ అధికారులతో మాట్లాడేందుకు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ టెలి కాన్ఫరెన్స్లో పారిశుద్ధ్య నిర్వాహణలో ఉన్న ఎస్ఐలందరూ వారి కేటాయించిన ప్రదేశాల్లో వారు ఉన్నారా వారికి కేటాయించిన పారిశుధ్య కార్మికు లందరూ వారి దగ్గర ఉన్నారా లేదా, వారు విధులు నిర్వహిస్తున్నారా లేదా అని సానిటరీ ఇన్స్పెక్టర్ లతో మాట్లాడి వారి విధుల నిర్వహణ పరిశీలించారు.  అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేయాలని, ఎవరికి కేటాయించిన ప్రదేశాలలో వారు అక్కడే ఉంటూ విధులను నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అన్నారు.

భక్తులు ఎక్కువగా ఉండటం వలన త్రాగునీటి సరఫరా లో ఎటువంటి లోపం లేకుండా కేటాయించిన స్టాక్ పాయింట్ లో ఎప్పటికప్పుడు స్టాక్ ని చూసుకుంటూ అమ్మవారి భక్తులకు త్రాగునీరు అందించడంలో ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ ఎస్ ఎన్ ప్రసాద్ తో అన్నారు. స్టాక్ పాయింట్ వద్ద ఉన్న ఏఈ లతో మాట్లాడి ప్రతి స్టాక్ పాయింట్ లో అవసరమైనంత స్టాక్ ఉందా లేదా అని పరిశీలించారు. అమ్మవారి భక్తుల సౌకర్యార్థం కల్పించిన తాత్కాలిక మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రపరుస్తూ, నీటి సరఫరా, వసతులను అధికారుల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలని ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

జనాభా గణన 2027లో వివరాలు నమోదు ప్రతి పౌరుని కనీస భాధ్యత…

-గుంటూరు నగర ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి మరియు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *