Breaking News

Monthly Archives: December 2024

టెన్‌పిన్ జాతీయ బౌలింగ్‌లో స‌త్తా చాటిన తెలుగు తేజం

-ఛాంపియ‌న్‌గా నిలిచిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన సుమ‌తి న‌ల్ల‌బంటు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : బెంగళూరులోని అమీబా బౌలింగ్ సెంటర్‌లో న‌వంబ‌రు 30న జ‌రిగిన ఏఆర్సీ 33వ జాతీయ టెన్‌పిన్ బౌలింగ్ ఛాంపియన్‌ షిప్‌లో కర్ణాటకకు చెందిన ఆకాశ్ అశోక్ కుమార్, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సుమతి నల్లబంటు ఛాంపియన్‌లుగా నిలిచారు. వరుసగా తన 7వ ఫైనల్‌ను ఆడుతున్న కర్ణాటకకు చెందిన ఆకాష్ రెండు గేమ్‌ల టైటిల్ పోరులో ఢిల్లీకి చెందిన షేక్ అబ్దుల్ హమీద్ (425-353)పై సునాయాసంగా విజయం సాధించి తన 3వ టైటిల్‌ను …

Read More »

మంత్రి అమిత్ షాని కలిసిన వల్లభనేని బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రి అమిత్ షా ని సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి, ఇటీవల మహారాష్ట్ర లో జరిగిన ఎన్నికలలో విజయం సాధించినందుకు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అభినందనలు తెలియ జేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ మహారాష్ట్ర లో జనసేన అధ్యక్షులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  ప్రచారం నిర్వహించిన అన్ని ప్రాంతాలలో తమ అభ్యర్థులు విజయం సాధించారని, పవన్ కళ్యాణ్ కు అక్కడి …

Read More »

కార్మిక రాజ్య భీమా (ESI) స్కీమ్ వృద్ధి గణనీయంగా ఉంది…

-సుమితా దావ్రా, సెక్రటరీ – కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, భారతదేశ ప్రభుత్వం వారు ఈ‌ఎస్‌ఐ హాస్పిటల్ గుణదల, విజయవాడ మరియు ఈ‌ఎస్‌ఐ డిస్పెన్సరీ – ఆటోనగర్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌లో రోగులను సందర్శించి మరియు వారితో సంభాషించారు -సెక్రటరీ, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ‌ఎస్‌ఐ పథకం పురోగతిని సమీక్షించి, ధానితో పాటు ఈ‌ఎస్‌ఐ‌సి మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ప్రశంసించారు -సెక్రటరీ, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, …

Read More »

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : “ప్రధానమంత్రి ఫసల్ భీమ యోజన” పథకం రైతులు సద్వినియోగం చేసుకునే విధంగా వారిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం సోమవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకం మంచి పథకమని, ప్రీమియం చాలా తక్కువ, రైతులకు పంట నష్టం జరిగినప్పుడు …

Read More »

అర్జీదారు సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : తమ సమస్యల పరిష్కారానికి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి అధికారుల దృష్టికి తీసుకువచ్చిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశపు మందిరంలో ఆయన మీకోసం కార్యక్రమం నిర్వహించి డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, అదనపు ఎస్పి వివి నాయుడు, బందరు ఆర్టీవో కే స్వాతితో కలిసి వివిధ ప్రాంతాల నుంచి తరలి …

Read More »

వ్యర్థ నిర్వహణలో అధునాతన టెక్నాలజీని వాడండి

-విజయవాడ నగర పాలకు సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యర్థ నిర్వాహణలో విజయవాడలో అగ్రస్థానంలో నిలవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, అధికారులను ఆదేశించారు. విజయవాడ ను స్వచ్ఛతలో ముందడుగులో ఉంచేందుకు గత ఏడు సంవత్సరాలుగా స్వచ్ఛ సర్వేక్షన్ లో మొదటి స్థానంలో ఉన్న ఇండోర్ నగరము విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులతో పర్యటించారు. ఇండోర్ నగరంలో అమలు చేస్తున్న వ్యర్ధపదార్థాల నిర్వహణను అధికారులతో పరిశీలించారు. వాళ్ళు అమలు చేస్తున్న ఇంటి వద్దనే వ్యర్ధాలను …

Read More »

ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారమే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

-ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన 10 ఫిర్యాదులు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను నిత్యం పరిష్కరించే దిశగా జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ నందు సోమవారం ఉదయం కమిషనర్ ధ్యానచంద్ర సూచన మేరకు అధికారులు నిర్వహించారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అధికారులు 10 ఫిర్యాదులు అందుకున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు స్వీకరించిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని ఫిర్యాదులు …

Read More »

విద్యుత్‌ ఒప్పందాల రద్దు కోసం ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేయాలి

-కూటమి ఎమ్మెల్యేలు తీర్మానించాలి -సెకీతో ఒప్పందంతో ప్రజలపై లక్షా 10వేల కోట్ల భారం -ప్రజలపై భారాలు యనమల గుర్తెరగాలి -ఆదానీకి దోచిపెట్టిన జగన్‌ -రైతులు, వలంటీర్లకు ఇచ్చిన హామీలు చంద్రబాబు నిలబెట్టుకోవాలి -విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ హయాంలో ఆదానీతో చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాలను రద్దు చేయాలని, దాని కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి, అందులో తీర్మానించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. …

Read More »

భూపతిరాజు సూర్య నారాయణ రాజు పేరిట ట్ర‌స్ట్

-కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రకటన భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : నా తండ్రి భూపతిరాజు ‌సూర్యనారాయణ రాజు పేరిట ట్ర‌స్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రకటించారు. పార్లమెంటు సభ్యుడు గా వచ్చే బెనిఫిట్ కూడా ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి వినియోగిస్తానని తన తండ్రి ‌సం‌స్మరణ సభలో ప్రకటించారు. బిజెపి కార్యకర్త గా ప్రస్తానం ప్రారంభించి తండ్రి ప్రోత్సాహం తో ఈ స్థాయికి చేరుకున్నాను అన్నారు. మా కుటుంబం స్వాతంత్ర్య సమరయోధులు కుటుంబం …

Read More »

ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, పౌర సేవలపై ప్రజల నుంచి నిరంతర ఫీడ్ బ్యాక్

-మెరుగైన సేవల కోసం నేరుగా లబ్ధిదారుల నుంచి అభిప్రాయ సేకరణ -ఐవిఆర్ఎస్ విధానాన్ని విస్తృతంగా ఉపయోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం -ఏ అంశంపైనైనా ప్రజలు చెప్పిందే ఫైనల్ అంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు -నాణ్యమైన సేవల కోసం ఖచ్చితమైన అభిప్రాయం చెప్పాలని ప్రజలకు సీఎం విన్నపం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, చేపట్టే కార్యక్రమాలు, తీసుకునే నిర్ణయాలపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు వారి …

Read More »