విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 6 నుంచి 8 తేది వరకు సింగపూర్‌లో జరిగిన 10వ ఏషియన్ యోగా స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్‌లో నగరానికి చెందిన పోరంకి సత్య ప్రసాద్ రాజు పలు విభాగాల్లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ పొందడం అభినందనీయమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. ఆదివారం ఉదయం 7వడివిజన్‌లో జర్నలిస్ట్ కాలనీకి చెందిన పోరంకి సత్యప్రసాద్‌రాజును తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ నిత్యం …
Read More »Daily Archives: January 12, 2025
కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ 475 రాష్ట్ర కమిటీ ఎన్నిక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ 475 రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం ఆదివారం విజయవాడలోని స్థానిక యుటిఎఫ్ భవన్ లో గొర్ల మాణిక్యం అధ్యక్షతన నిర్వహించటం జరిగినది. ఈ సమావేశానికి కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ హాజరయ్యారు.ఈ సమావేశంలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ సంఘం నిర్మాణం, రెగ్యులరైజేషన్ తదితర అంశాలను చర్చించి, అనంతరం ఉన్నత విద్యా పరిరక్షణ సమితి అధ్యక్షులు రాజగోపాల్ బాబు,ప్రజాశక్తి మాజీ సంపాదకులు వీ …
Read More »స్వామి వివేకానంద స్ఫూర్తితో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి
– ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా శ్రమించి యువత ముందడుగు వేయాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటిని చేరుకునేందుకు శ్రమించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ఆదివారం స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజనోత్సవం సందర్భంగా విజయవాడలోని రాఘవయ్య పార్కు వద్ద జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. అధికారులతో కలిసి వివేకానంద విగ్రహానికి పూల …
Read More »జి.కొండూరు నుంచి దుగ్గిరాలపాడు వరకు బస్సు సర్వీసు ఏర్పాటుకి కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివనాథ్
-జి.కొండూరు మండలంలో సి.సి.రోడ్లు, గోకులం షెడ్లు ప్రారంభం -ప్రారంభించిన ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ -గంగినేని పాలెం లో సంక్రాంతి సంబరాలు ప్రారంభం మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జి.కొండూరు నుంచి దుగ్గిరాల పాడు రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. రహదారి సరిగ్గా లేకపోవటం వల్ల ఈ మార్గంలో వచ్చే బస్సు సర్వీసు నిలిచి పోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జి.కొండూరు దుగ్గిరాల పాడు రహదారి నిర్మించి ఈ మార్గంలో బస్సు సర్వీసు …
Read More »ఐబిఎస్ కంపెనీ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్ కు చెందిన ఐబిఎస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టేషన్స్ కంపెనీ క్యాలెండర్ ను ఆదివారం మంగళగిరి ఎసిఎ అంతర్జాతీయ క్రికెట్ స్డేడియంలో ఎంపి కేశినేని శివనాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కంపెనీ ఎండి వడ్లమూడి హర్షకి ఎంపి కేశినేని శివనాథ్ శుభాకాంక్షలు తెలిపారు. క్యాలెండర్ ఆవిష్కరించిన ఎంపి కేశినేని శివనాథ్ కు వడ్లమూడి హర్ష కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు కొండలరావు, అంజనీ కుమార్, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పొతినేని శ్రీనివాస్ …
Read More »కులాల మతాలకు అతీతంగా జరుపుకునే పండగ సంక్రాంతి : కేశినేని జానకి లక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అభివృద్ది పథంలో పయనిస్తుంది. రాష్ట్ర ప్రజలందరూ సంక్రాంతి పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. కులాల మతాలకు అతీతంగా జరుపుకునే పండగ సంక్రాంతి అని ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) సతీమణి కేశినేని జానకి లక్ష్మి అన్నారు. పశ్చిమ నియోజకవర్గం పంజా సెంటర్ దగ్గర గణపతిరావు రోడ్ లో గల ఖిద్మత్ ఘర్ కార్యాలయం ఆదివారం జరిగిన సంక్రాంతి సంబరాల్లో ముఖ్యఅతిథిగా కేశినేని జానకి లక్ష్మి హాజరైయ్యారు. …
Read More »అమరావతి రాజధాని లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రాబోతుంది : ఎంపి కేశినేని శివనాథ్
-ఎసిఎ క్రికెట్ స్టేడియంలో ఎంపియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం -క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎంపి కేశినేని శివనాథ్ -రాజధాని ప్రాంతంలో రెండు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలు -ఏసీఏ తరుఫున త్వరలో ఎపిఎల్ టోర్నమెంట్ -జనవరి ఆఖరుకి విజయనగరం క్రికెట్ అకాడమీ ప్రారంభం -రూ.50 కోట్లతో వైజాగ్ స్టేడియం ఆధునీకరణ పనులు -అభివృద్ధి విషయంలో మంత్రి నారా లోకేష్ ముందంజ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని క్రీడాంధ్ర ప్రదేశ్ గా తయారు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ …
Read More »ప్రజలకు మోటూరి శంకర్‌రావు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు నెలవు సంక్రాంతి పండుగ అని ప్రజలందరు ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకొంటున్నానని ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌సర్వీస్‌మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మోటూరి శంకర్‌రావు తెలిపారు. బోగీ, మకర సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకోవాలని, భగవంతుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకొంటున్నట్టు మోటూరి శంకర్‌రావు అందరికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఇంటి సిరులు కురిపించాలని, ఆరోగ్యం ఆనందాలు వేదజల్లాలని అభిలాష వ్యక్తం చేస్తూ …
Read More »జిల్లా ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు… : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం,, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప్రజలకు కలెక్టర్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ… జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో తులతూగుతూ ఉండాలని, భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందంగా జరుపుకోవాలన్నారు. సంక్రాంతి అనగా నూతన క్రాంతి అని, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారని, ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారన్నారు. సంక్రాంతి పండుగను మొదటి రోజు భోగి మంటలతో, రెండవ రోజు పొంగలి, పిండివంటలతో, పితృ దేవతలు, దేవుళ్ల పూజలతో, మూడవ రోజు గోపూజలతో మూడురోజుల …
Read More »రాష్ర్ట ప్రజలందరికీ భోగీ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అనగాని సత్యప్రసాద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ధాన్యరాశులు ఇంటికి తరలివచ్చే వేళ జరుపుకునే ఈ పండుగ అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని మంత్రి అనగాని ఆశించారు. ప్రజలందరూ పుట్టిన ఊళ్లకు చేరుకొని బంధుమిత్రులతో కలిసిపోయి ఆనందంగా పండుగు జరపుకోవాలని మంత్రి అనగాని కోరుకున్నారు. గత ఐదేళ్లు సంక్రాంతి పండుగ కళ తప్పిందని. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోందని మంత్రి అనగాని వెల్లడించారు. ఇందుకు గత ఏడాది కంటే అధిక సంఖ్యలో సొంతూళ్లకు చేరుకుంటున్న వివిధ పట్టణాలకు చెందిన ప్రజలే …
Read More »