-కొండ ప్రాంతాల్లో మరో నాలుగు వాటర్ ట్యాంకులు నిర్మాణం చేస్తాం
-ప్రతి ఇంటికి తాగునీటిని అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం
-5 వ డివిజన్ లో వాటర్ ట్యాంక్, రోడ్డుపనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ మోహన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్ క్రీస్తు రాజ పురం. ఆర్.సీ.ఎం. చర్చి వెనుక కొండ ప్రాంతంలో వాటర్ ట్యాంక్ పనులకు, జయప్రకాష్ నగర్ మూడో లైను రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ శంకుస్థాపన చేశారు. అనంతరం నవతా బోసు గారి ఇంటి దగ్గర జరుగు జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గం పరిధిలోని కొండ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.కొండపై ప్రాంతాల్లో ఇప్పుడు నిర్మాణం చేస్తున్న ట్యాంక్ తో కలిపి అదనంగా మరో నాలుగు వాటర్ ట్యాంకులను నిర్మాణం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొండ ప్రాంతాల్లోని తాగునీటి సమస్య గురించి ఆదివారం జరిగిన డీఆర్సీ మీటింగ్ లో జిల్లా ఇన్చార్జి మంత్రి వై. సత్య కుమార్ కు వివరించానని ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ అన్నారు. ఇప్పుడు నిర్మాణం చేస్తున్న వాటర్ ట్యాంక్ ను 2014 -19 ప్రభుత్వ హయాంలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేసారని చెప్పారు. కాంట్రాక్టర్ పనులను ప్రారంభించి కొంత భాగం పనులను పూర్తి చేశారని, 2019లో జరిగిన ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన వైఏస్. జగన్మోహన్ రెడ్డి ఈ ట్యాంక్ నిర్మాణ పనులను నిలుపు చేయించారన్నారు. పేదలు నివసించే ప్రాంతంలో తాగునీటి అవసరాలు కోసం నిర్మాణం చేస్తున్న ఈ వాటర్ ట్యాంకు పనులను కూడా ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో కొండ ప్రాంతంలో ఒక్క వాటర్ ట్యాంక్ కూడా నిర్మాణం చేయలేదని అన్నారు. ప్రజల ముఖ్య అవసరాలు అయినా తాగునీరు అందించడానికి, రహదారుల నిర్మాణానికి ఖర్చు చేస్తుందని, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించలేదని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొండ ప్రాంతంలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి నిధులను సమకూర్చుకొని పనులను ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ వాటర్ ట్యాంకు కాకుండా అదనంగా మరో మూడు వాటర్ ట్యాంక్ లను నిర్మాణం చేసి కొండ ప్రాంతాల్లోని వారికి పుష్కలంగా తాగునీటిని అందిస్తామని అన్నారు. కృష్ణా నది నుంచి నీటిని తీసుకొని నగరవాసులకు అందరికీ సురక్షితమైన నీటిని అందిస్తామని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. కొండ పై ప్రాంతంలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోయినా తమ ప్రభుత్వం కాంట్రాక్టర్లను ఒప్పించి నిధులను మంజూరు చేయించుకుని పనులను చేయిస్తున్నామని చెప్పారు. త్వరగా ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను పూర్తి చేయించి ప్రజలకు తాగునీటిని అందిస్తామని చెప్పారు. గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయంలో ఎందుకు వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు చేయలేకపోయారనే విషయాన్ని, తమ ప్రభుత్వం వచ్చిన నెలల వ్యవధిలోనే ఇక్కడ వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను ప్రారంభిస్తుందనే విషయాలను కూడా ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ అన్నారు.
ఐదో డివిజన్ అధ్యక్షుడు నందిపాటి దేవానంద్ మాట్లాడుతూ ఈరోజు నిజంగా కొండ ప్రాంత వాసులకు పండుగ రోజు అని అన్నారు. కొండపై ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ప్రధాన సమస్య అయిన మంచినీటి సమస్యను పరిష్కారానికి నాలుగు వాటర్ ట్యాంకులను నిర్మాణం చేయించడానికి ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చర్యలు తీసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కొండ ప్రాంతాల్లో ఏ సమస్య వచ్చినా వాటిని పరిష్కరించడానికి తమ ప్రభుత్వం ముందుంటుందని ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ చెప్పడం చాలా ఆనందంగా ఉందన్నారు. కొండ ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ముందుండి వాటిని పరిష్కరిస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో E.E సామ్రాజ్యం, గద్దె రమేష్,సిద్దుల వివేక్,యలమంచిలి రాజేష్,కోడూరు సుబ్రహ్మణ్యం, రిమ్మనపూడి బ్రహ్మేశ్వరరావు, రాచమల్లఆంజనేయులు,మాచర్లఆనంద్, కెనడి,షేక్ షరీఫ్,షేక్ అనీఫ్ తదితరులు పాల్గొన్నారు.