గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని జనన, మరణ నమోదు కేంద్రంలో ప్రజల నుండి అందే దరఖాస్తులు 48 గంటల్లో పరిష్కారం కావాలని, నెలల తరబడి పెండింగ్ లో ఉంటే సంబందిత సిబ్బందిపై చర్యలు తప్పవని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. శనివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని జనన మరణ నమోదు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, కొన్ని అర్జీలు నెలల తరబడి పెండింగ్ ఉండడం గమనించి ఆగ్రహం వ్యక్తం చేసి, తక్షణం విభాగ డేటా ఎంట్రీ ఆపరేటర్లను మరో విభాగానికి బదిలీ చేయాలని మేనేజర్ ని ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత జనన మరణ నమోదు కేంద్రంలో సిబ్బంది సకాలంలో హాజరు కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజల నుండి అందిన ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, కొన్ని నెలల తరబడి పెండింగ్ లో ఉండడం గమనించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుండి విభాగానికి అందే అర్జీలు 48 గంటల్లోగా పరిష్కారం జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు పెండింగ్ దరఖాస్తులు 2 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. విభాగంలోని డేటా ఎంట్రీ ఆపరేటర్లను మరో విభాగానికి బదిలీ చేసి, నూతన ఆపరేటర్లను కేటాయించాలని మేనేజర్ ని ఆదేశించారు. విభాగంలో ప్రజలకు జవాబుదారీతనంతో సిబ్బంది వ్యవహరించాలని, జనన, మరణ ధృవ పత్రాలు అత్యావశ్యకమని, అటువంటి ధృవ పత్రాలు అందించే విభాగం పనితీరు మెరుగు పరుచుకోవాలని, నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకోక తప్పదని స్పష్టం చేశారు. అర్జీల క్షేత్ర స్థాయిలో పరిశీలనను శానిటేషన్ కార్యదర్శులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆదేశించారు.
Tags guntur
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …