-పతాక నిధికి విరాళాలు అందించేందుకు ముందుకు రావాలి..
-జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మిశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ రక్షణ కోరకు ప్రాణాలను అర్పించిన వీర సైనికల కుటుంబాలను ఆదుకోవాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సాయుధ దళాల పతాక నిధికి విరివిగా విరాళాలు అందించేందుకు ముందుకురావాలని జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మిశ పిలుపునిచ్చారు.
సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే ) పురస్కరించుకుని శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మిశ తన కుమారునితో కలిసి సాయుధ దళాల పతాక నిధికి విరాళం అందించి జిల్లా సైనిక సంక్షేమ అధికారి నుండి పతాకాన్ని అందుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సైనిక సేవలు లేనిదే దేశ రక్షణకు మనుగడ లేదన్నారు. కుటుంబాలకు దూరమై దేశ సరిహద్దులలో జీవితాన్ని కొనసాగిస్తు అహర్నిశలు రేయింబవళ్ళు కంటికి రెప్పల కాపల కాస్తూ ముష్కర్లు దేశ సరిహద్దులలోకి చొరబడకుండా సేవలు అందిస్తున్న జవానులకు ప్రతి ఒక్కరూ వందనాలు అర్పించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ గౌరవాన్ని కాపాడేందుకు సరిహద్దుల్లో ధైర్యంగా పోరాడి వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించి వారి కుటుంబాలకు అండగా నిలిచే సంకల్పంతో 1949 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 7వ తేదిన సాయిధ దళాల పతాక దినోత్సవాన్ని పాటిస్తున్నామన్నారు. భారత సైనికులు మొక్కవోని దీక్షతో చూపుతున్న దేశభక్తి సాహసం త్యాగాల పట్ల దేశం గర్విస్తుందన్నారు. దేశ రక్షణకై పోరాడి ఆసువులుబాసిన సైనికుల కుటుంబ సభ్యులకు సాయుధ దళాల పతాక దినోత్సవసందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్తాన్ చైనాలతో జరిగిన యుద్ధం, కార్గిల్ పోరాటం ముంబై తాజ్ హోటల్ పై దాడి వంటి సంఘటనలతో పాటు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు భారత జవానుల ధైర్యసహసాలు తెగువకు జాతి యావత్తు గర్విస్తుందన్నారు. ఆయా సమయాలలో ఎంతో మంది జవానులు వీరమరణం పొందరన్నారు. మనం స్వేచ్చగా జీవించగలుగుతున్నామంటే అందుకు కారణం మన సైనికుల రక్షణే కారణమన్నారు. దేశ రక్షణలో పాటుపాడుతున్న ప్రతి సైనికునికి మనం ఎంతో రుణపడి ఉన్నామన్నారు. వారి రుణం తీర్చుకునే అవకాశం పతాక దినోత్సవం కల్పించిందన్నారు. వీర మరణం పొందిన సైనికుల తల్లిదండ్రులు, వితంతువులు అయిన భార్య పిల్లలకు మనకు తోచిన రీతిలో స్పందించి జిల్లా ప్రజలు వ్యాపార వేత్తలు పారిశ్రామిక వేత్తలు విద్యాసంస్థలు విరివిగా విరాళాలు అందించడం ద్వారా కొంత మేరకు లోటు తీర్చగలిగే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ పతాక నిధికి విరాళలు అందించేందుకు ముందుకు రావాలని లక్ష్మిశ పిలుపు నిచ్చారు.
జిల్లా సైనిక సంక్షేమ అధికార సర్జస్ లెఫ్టనెంట్ కమాండర్ కె. కళ్యాణ వీణ మాట్లాడుతూ యుద్ధ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, వికలాంగులైన వారి సంరక్షణకు సామాజంలో ప్రతి ఒక్కరూ ఇతోదిక సహాయం అందిస్తే గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు అండగా ఉన్నట్లవుతుందన్నారు. గుండె జబ్బులు క్యాన్సర్ జాయింట్ రీప్లే స్మెంట్ వంటి తీవ్రమైన వ్యాధులతో బాదపడుతూ అధికంగా చికిత్స చేయించుకోలేని మాజీ సైనికులకు ఈ విరాళం ద్వారా సహాయం అందించే అవకాశం ఉందన్నారు. పతాక నిధికి అందించే విరాళాలలకు 80(G) (5) (VI) of Income Tax Act 1961 ద్వారా ఆదాయ పన్ను రాయితీ లభిస్తుందని, స్వచ్ఛందంగా విరాళాలు అందించేందుకు ముందుకు వచ్చేవారు జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎన్టీఆర్ జిల్లా అధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఖాతా 62067742138 ఐఎఫ్‌ఎస్సి కోడ్ ఎస్బిఐఎన్ 0020899 ద్వారా నేరుగా తమ విరాళాలు అందించవచ్చునని లెఫ్టనెంట్ కమాండం కె కళ్యాణ వీణ తెలిపారు.
కార్యక్రమంలో మాజీ సైనికులు, సైనిక సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు, శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్దార్ధ మహిళ కళాశాల, సిద్ధార్ధ ఆర్ట్స్ కళాశాల విద్యార్థిని, విధ్యార్థులు పాల్గొన్నారు.