తిరువూరు శ్రీ వాహిని కళాశాలలో ఫిట్ ఇండియా బ్లాక్ లెవల్ క్రీడా పోటీలు

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం ఎన్టీఆర్ జిల్లా మరియు శ్రీ వాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్త ఆధ్వర్యంలో బ్లాక్ లెవెల్ క్రీడా పోటీలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఫిట్ ఇండియా మూవ్మెంట్ ఆగస్టు-29, 2019 ప్రకారం దేశంలోని యువత అంతా ఆరోగ్యపరమైన మరియు కండరపుష్టిని కలిగి ఉండాలని శారీరక శ్రమ క్రీడలు ఆడడం ద్వారా ఆరోగ్యం కల్పించుకోవాలని ఈ ఫిట్ ఇండియా మూమెంట్ను తీసుకురావడం జరిగింది.

ఈ ఫిట్ ఇండియా మూవ్మెంట్ ను పురస్కరించుకుని “స్వస్థ రాష్ట్ర- సమర్థ్ రాష్ట్ర” అనే థీమ్ తొ ఈ రోజు జిల్లాలో తిరువూరు శ్రీ వాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజి గ్రౌండ్స్ లో ఆ రోజు బ్లాక్ లెవెల్ క్రీడా పోటీలు నిర్వహించారు.

ఈ ఆటల పోటీల్లో కబాడీ ,వాలీబాల్ ,రన్నింగ్ ,షటిల్ పోటీలు జరిగాయి విద్యార్థులు పోటాపోటీగా తలబడ్డారు, కళాశాల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ కే కే వి ప్రసాద్ కళాశాల పిడి బి సురేష్ విజేతలకు బహుమతులు అందించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల చైర్మన్ పసుమర్తి వెంకటేశ్వర రావు, కరస్పాండెంట్ పోట్రు నాగేశ్వరావు, ఎన్నారై మరియు కళాశాల డైరెక్టర్ ఎన్ వెంకటరెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ రంగా నాగేంద్రబాబు, కళాశాల కోశాధికారి ముత్యాల కిషోర్ బాబు పాల్గొని విద్యార్థులను ఎంతగానో ప్రోత్సహించి విద్యార్థులకు మానసిక మరియు శారీరక ఆరోగ్యం కోసం ప్రతిరోజు కొంత సమయం ఆటలు ఆడుకోవాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *