Breaking News

శ్రీ హరిపురం కాలనీ, కేతనకొండ ప్లాట్ ఓనర్స్ ధర్నా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీహరిపురం కాలనీ కేతనకొండ ప్లాట్ ఓనర్స్ న్యాయం జరగాలని, శ్రీహరిపురం కాలనీ లేఅవుట్ డెవలప్మెంట్ పనులు పూర్తి చేయించాలని, మార్ట్ గేజ్ ప్లాట్లు సభ్యులు 69 మందికి ప్లాట్లను కేటాయించి రిజిస్ట్రేషన్ పూర్తి చేయించాలని, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి. శ్రీనివాస్ అన్నారు. స్థానిక గాంధీనగర్ ధర్నా చౌక్ లో శనివారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీహరిపురం గవర్నమెంట్ ఎంప్లాయిస్ కోపరేటివ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నావి పోతవరం ప్రెసిడెంట్ వి. శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మ్యూచువల్లీ ఎయిడెడ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ ను రిజిస్టర్డ్ నెంబర్ ఏ ఎం సి/ కెఎన్ఎ/ డి సి ఓ/ 2016/ 2022 ఆఫీస్ లయోలా గార్డెన్స్ రోడ్ నెంబర్ 3, విజయవాడ- 8 2016లో రిజిస్టర్ చేశారు. 2029లో 85 ఎకరాల పొలం 110 కోట్ల రూపాయలకు కొన్నామని చెప్పారు. భూ యజమానులకు పూర్తి మొత్తం చెల్లించకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. యజమానులు తమకు 43 కోట్ల రూపాయలు సొసైటీ వారు చెల్లించాలని 2022 లో కోర్టులో దావా వేశారు. 630 ప్లాట్ల అమ్మగా 121 కోట్లు, 72 మార్ట్ గేజ్ ప్లాట్లకు 8 కోట్ల రూపాయలు ఆదాయం అనగా మొత్తం 129 కోట్లు రూపాయలు వచ్చినప్పటికీ యజమానులకు ఇంకనూ బకాయిలు ఉన్నాయి కట్టమంటున్నారని అన్నారు. భూమి కొనుగోలు కొరకు బ్రోకర్స్ 6 కోట్లు ,సొసైటీ ఆఫీస్ నిర్వహణకు 19 కోట్లు ఖర్చు చేశామంటున్నారు. కేవలం లేఅవుట్ లో ప్లాట్లు మార్కింగ్ మరియు ఖచ్చా రోడ్డు ల ఏర్పాటు చేయడం జరిగిందిఅని ,ఈ పనులకు 31 కోట్లు ఖర్చు చూపిస్తున్నారు. సొసైటీ నష్టాలలో ఉన్నందున ప్లాట్ రిజిస్ట్రేషన్ పూర్తయిన ప్లాట్లు ఓనర్లు అందరూ సొసైటీ నష్టాల్లో ఉన్నందున, ప్లాట్లు పూర్తి అయిన ఫ్లాట్ ఓనర్లు అందరూ చ.గ.కి 1500 రూపాయలు అదనంగా చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. సొసైటీ వారు ,ప్రతి సంవత్సరం సభ్యుల జనరల్ బాడీ నడపాలి. మొత్తం సభ్యులలో1/4 వంతు మంది రం వన్ టు మంది (కోరం) జనరల్ బాడీకి హాజరు కావాలి. అప్పుడు మాత్రమే సోసైటీ చేసే తీర్మానాలు చెల్లుబాటు అవుతాయని ఆయన అన్నారు సొసైటీ ఏర్పడినప్పటి నుండి నేటి వరకు ఏ జనరల్ బాడీ సమావేశానికి(కోరం )లేదు కోరం లేకుండానే తీర్మానాలు ఆమోదం పొందాయి అని అన్నారు. ఇష్టం వచ్చినట్లు చెబుతున్నారు సొసైటీ డైరెక్టర్లు ఎన్నిక పెద్ద ఫార్సుగా నిర్వహిస్తున్నారని సభ్యులు ఎటువంటి వర్తమానం ఉండదని తీర్మానాలు పంపిణీ చేయడం కనీసం సొసైటీ సభ్యులు లేదా ప్లాట్ఫాండర్లా సమాచారం అడిగిన ఎవరని సహకార సొసైటీలో సహకారం పూర్తిగా లేదని ఆయన అన్నారు ఈ దురాగతాలను ప్రశ్నించిన వారిని సొసైటీ సభ్యత్వం నుండి తొలగించామని అంటున్నారు. ఈ విషయం కూటమి ప్రభుత్వానికి నాయకులందరికీ వినతి పత్రాలు ద్వారా తెలియపరిచామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ పి.ఎస్.ఎన్ రాజు, సెక్రెటరీ రత్న ప్రసాద్, పి ఎస్ ఎస్ ప్రసాద్, ట్రెజరర్ పిబి విఎస్ నాగేశ్వరరావు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కళాకారులకు చేయూత… కొండపల్లి బొమ్మలకు కొత్త దిశ

– ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌ను సంద‌ర్శించిన క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *