-బాధితురాలిన పరామర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర….
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 27వ తేదీన మచిలీపట్నం కాసానిగూడెంలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటనలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలని ఆదివారం రాష్ట్ర గనులు భూగర్భ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి బాధితురాలికి బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్యాన్ని వైద్యాధికారులని ఆడి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంఘటన జరగడం దురదృష్టకరమని, ఈ ఘటనకు పాల్పడిన నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. బాలిక సంరక్షణ బాధ్యతలను ప్రభుత్వం తీసుకుంటుందని కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఇటువంటి ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడం జరుగుతుందన్నారు. ఇటువంటి ఘటనలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు .ఇప్పటికే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారన్నారని మంత్రి అన్నారు.