Breaking News

ఘనంగా కూచిపూడి పతాక స్వర్ణోత్సవ ముగింపు వేడుకలు….

-ఆకట్టుకున్న బృంద నృత్యం…..

కృష్ణాజిల్లా, మొవ్వ/ కూచిపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రులు కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు,పామర్రు శాసన సభ్యులు వర్ల కుమార్ రాజా, కూచిపూడి నృత్యకారులు. ఆకట్టుకున్న ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన కళాకారుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ 50 అడుగుల ఏకశిలపై కూచిపూడి నృత్య భంగిమలతో పతాకాన్ని ప్రపంచానికి సమర్పించడం అద్భుతమైన కార్యక్రమం అని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కూచిపూడి నృత్యం ఆవిర్భవించిన మన రాష్ట్రంలో ఆదరణ లేకపోవడం బాధాకరమన్నారు. కూచిపూడి నృత్యం అజరామంగా విరాజిల్లే విధంగా చేసే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. భావితరాల నుండి వస్తున్న మన సంస్కృతి, సాంప్రదాయ కళలు అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని మంత్రి అన్నారు.

రాష్ట్ర గనులు భూగర్భ ,ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  ఎప్పుడు మాట్లాడిన ఆయన నోటి వెంట ముందుగా వచ్చేది కూచిపూడి నాట్యం గురించే అని అన్నారు. కూచిపూడి నృత్యాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే బాధ్యత జిల్లా వాసిగా నేను తీసుకుంటాను అని మంత్రి అన్నారు. కూచిపూడి నృత్య కళాకారులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి అవకాశం కల్పించేలా కార్యాచరణ రూపొందిస్తా మన్నారు. రాష్ట్రంలోని అన్ని శాఖల సమన్వయంతో, స్థలాలు కేటాయించి కూచిపూడి క్షేత్రాలు ఏర్పాటుతో భావితరాలకు కూచిపూడి నృత్యాన్ని చేరువ చేసేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు.

శాసన సభ ఉప సభాపతి రఘు రామ కృష్ణంరాజు మాట్లాడుతూ మూడు దశాబ్దాల క్రితం సిద్ధేంద్ర యోగి క్షేత్రం మీదుగా ఆవిర్భవించిన కూచిపూడి నృత్యం నేడు ప్రపంచవ్యాప్తంగా దశదిశలా విరాజిల్లుతుందన్నారు. భాషకు, సంస్కృతికి ప్రాధాన్యత ఇచ్చే ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారన్నారు. మన భాషను, సంస్కృతిని, సాంప్రదాయాన్ని అంతం చేసే ప్రభుత్వం గతంలో ఉందని అదృష్టవశాత్తు నేడు వాటిని కాపాడే ప్రభుత్వం రావడం ఎంతో సంతోషకరమని అన్నారు. మన ఆంధ్ర సాంప్రదాయ నృత్య కళ కూచిపూడిని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడంలో ఎందరో మహానుభావులు తమ జీవితాలను అంకితం చేశారని ఉప సభాపతి అన్నారు.

Check Also

దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *