-1,600 మంది పేదలకు అందనున్న ఆర్ధిక సాయం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన సంవత్సరం తొలిరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు లబ్ది చేకూర్చేలా సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైలుపై మొదటి సంతకం చేశారు. దీంతో 1,600 మంది దరఖాస్తుదారులకు రూ. 24 కోట్ల మేర నిధులు విడుదల కానున్నాయి. గత ఏడాది అధికారం చేపట్టిన దగ్గర నుంచి డిసెంబర్ 31 వరకు రూ. 100 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులు పేదవర్గాలకు ఇచ్చారు. 7,523 మందికి లబ్ది కలిగింది. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా చేసిన సంతకంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్ కోసం విడుదల చేసిన నిధుల మొత్తం రూ. 124.16 కోట్లకు చేరింది. 9,123 మందికి ప్రయోజనం పొందినట్లయ్యింది.