-12వ పీఆర్సీ కమిషనర్ ని వెంటనే నియమించాలని గౌ ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేసిన ఏపీ జేఏసీ అమరావతి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి నారా చంధ్రబాబు నాయుడు ని ఆయన నివాసంలో బుదవారం ఎపిజేఏసి అమరావతి రాష్ట్రకమిటి మరియు అనుబంద సంఘాల నాయకులుతో కలసి ముఖ్యమంత్రి కి నూతనసంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడమైనది. ఈ సందర్భంగా, నాలుగు సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి చేతులు మీదగా ఏపిజెఏసి అమరావతి క్యాలండర్ మరియు ఏపీ రెవిన్యూ సర్వీసెస్ అసోషియేషన్, ఏపిపిటిడి(ఆర్టీసి)ఎంప్లాయీస్ యూనియన్ , ఏపి కో- ఆపరేటివ్ సర్వీసెస్ అసోషియేషన్ , ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డు ఎంప్లాయీస్ అసోషియేన్ , ఏపి హెడ్ మాష్టర్సు అసోషిషేయన్ (5 ప్రధాన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగులు) లకు సంబందించిన డైరీలను క్యాలండర్లను ఆవిష్కారించారు.
ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు ముఖ్యమంత్రి తో మాట్లాడుతూ….11వ పీఆర్సీ లో తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగులకు, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 12వ పీఆర్సీ కమిషనర్ ను వీలైనంత త్వరగా నియమించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏపిరెవిన్యూసర్వీసెస్ అసోషియేషన్ మరియు ఏపిజేఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపిపిటిడి(ఆర్టీసి)ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్రఅధ్యక్షులు, ఏపిజేఏసి అమరావతి సెక్రటరీ జెనరల్ అలాగే టి.వి.ఫణి పేర్రాజు ఏపి కో- ఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు,జెఏసి అసోషియేట్ చైర్మన్, కె.సంగీత రావు ఏపి పిఆర్ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్రఅధ్యక్షులు,జేఏసి కోశాధికారి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకట రాజేష్, పి.వి.రమణ ఏపి హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్రఅధ్యక్షులు, జనకుల శ్రీనివాసరావు ఏ.పి.పోలీసు అధికారుల సంఘం రాష్ట్రఅధ్యక్షులు, అలాగే ఏపి రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆర్గనైజీంగు కార్యదర్శి వి.వి.మురళీకృష్ణ నాయుడు, పి.నాగ రాజు, ఏపి ప్రభుత్వ డ్రైవర్శు అసోషియేషన్ రాష్ట్రఅధ్యక్షులు
ఎస్.శ్రీనివాసరావు, గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.అరలయ్య, ఏపీ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డా.టి.జయ ప్రకాష్, గ్రామీణ నీటి పారుదల ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.కుమార్, జి.జ్యోతి కోన ఆంజనేయ ప్రసాద్, ఏపీ ప్రభుత్వ డాక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా.డి.జయధీర్, క్లాస్ -IV అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ మల్లేశ్వరరావు, లేబర్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి.కిషోర్ కుమార్, ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం అధ్యక్షురాలు పారే లక్ష్మి, సెక్రెటరీ జనరల్ పొన్నురు విజయలక్ష్మి, కోశాధికారి డాక్టర్ సాయి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.