గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో 10వ తేదీలోపు శానిటరీ డివిజన్ల వారీగా ట్రేడ్ లైసెన్స్ లపై ఇన్స్పెక్టర్లు సమగ్ర నివేదిక ఇవ్వాలని, 17 నుండి డి&ఓ ట్రేడ్ లైసెన్స్ లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సామవేశ మందిరంలో ప్రజారోగ్య విభాగ అధికారులతో ట్రేడ్ లైసెన్స్ లు, పారిశుధ్య పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డ్ సచివాలయాల వారీగా డి&ఓ ట్రేడ్ లైసెన్స్లు ఉండాల్సిన సంఖ్య కన్నా తక్కువగా ఉన్నాయని, నూతనంగా శానిటరీ డివిజన్ల పునర్విభజన చేసినందున ఇన్స్పెక్టర్లు తమ డివిజన్ పరిధిలో ప్రస్తుతం ఉన్న ట్రేడ్ లైసెన్స్ లు, రెన్యువల్ చేసుకున్నవి, నూతనంగా తీసుకోవాల్సి ఉండి తీసుకోకుండా ఉన్న వివరాలతో వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నివేదిక మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తామని, నగరంలోని కమర్షియల్ సంస్థలు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే నగరంలో పారిశుధ్య విభాగ పనితీరులో మార్పు రావాలని, 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు స్పెషల్ శానిటేషన్ వీక్ గా రోడ్ల మీద వ్యర్ధాలు, డెబ్రిస్ తొలగించాలన్నరు. ఇప్పటికే నూతనంగా డంపర్ బిన్లను, పుష్ కాట్స్ ని అందించామని, డివిజన్ల వారీగా అవసరం మేరకు అదనపు ట్రాక్టర్లను కూడా ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చామన్నారు. 802 మైక్రో ప్యాకేట్స్ వారీగా మెరుగైన పారిశుధ్యం కోసం కృషి చేయాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారిని విధుల నుండి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. సూపర్వైజర్ల పేరుతో ఏ ఒక్క ప్రజారోగ్య కార్మికుడు ఉండడానికి వీలులేదన్నారు. ప్రజారోగ్య విభాగం నుండి అందించే సేవలు నిర్దేశిత గడువులోగా అందించాలని, శానిటరీ సూపర్వైజర్లు గడువులోగా అందించని సిబ్బంది, ఇన్స్పెక్టర్ల పై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ నెల 10 నాటికి నగరంలో రోడ్ల మీద ఆవులు, ఎద్దులు ఉండడానికి వీలు లేదని, వాటిని పట్టుకొని జిఎంసి గోశాలకు తరలించాలన్నారు. డివిజన్ల వారీగా కార్మికుల హాజరు, లీవుల రిజిస్టర్లు మెయిన్టైన్ చేయాలని, సెలవు చీటీ ఇచ్చిన తర్వాతనే సెలవు మంజూరు చేయాలన్నారు. ఎంహెచ్ఓ, సిఎంహెచ్ఓ ప్రజారోగ్య విభాగ పనితీరును ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పనితీరు మెరుగయ్యేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
సమావేశంలో సిఎంఓహెచ్ఓ డాక్టర్ శోభారాణి, డాక్టర్ పిజె అమృతం, ఎంహెచ్ఓ రవిబాబు, బయాలజిస్ట్ మధుసూదన్, ఏ ఎంహెచ్ఓలు ఆనందకుమార్, రాంబాబు, శానిటరీ సూపర్వైజర్లు ఆయుబ్ ఖాన్, సోమశేఖర్, ప్రజారోగ్య విభాగ సూపరిండెంట్ పోలేశ్వరరావు, ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …