తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ, మండల స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 6 నుండి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు సంబంధించి గురువారం తిరుపతి జిల్లాలో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులో రెవెన్యూ, భూ సమస్యలను సులభతరంగా పరిష్కరించుకోవడానికి అనువైన వేదిక రెవెన్యూ సదస్సులు అని ఈ వేదికను మండల గ్రామ స్థాయిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కొరకు జిల్లావ్యాప్తంగా నేడు 49 గ్రామ సభలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. గ్రామ ప్రజలకు భుసమస్యలు పరిష్కరించుకోనుటకు అనువైన వేదిక రెవెన్యూ సదస్సులు అని ఈ వేదికను మండల గ్రామ స్థాయిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ రెవిన్యూ సదస్సులలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల రెవెన్యూ, సంబందిత అధికారులు పాల్గొని విజయవంతంగా రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన వివిధ సమస్యలతో కూడిన దరఖాస్తులు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి చిన్న చిన్న సమస్యలు ఉన్న వాటిని అక్కడికక్కడే పరిష్కరించారన్నారు. తిరుపతి జిల్లాలో మొదటి రోజు నుండి నేటి వరకు జిల్లావ్యాప్తంగా 15193 అర్జీలు అందాయని అందులో నేడు 329 అర్జీలు వచ్చాయని అందులో అసైన్మెంట్ ఆఫ్ హౌస్ సైట్స్ పై-19, అసైన్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ పై -8, క్యాస్ట్ వెరిఫికేషన్-2,మీ సేవ ద్వారా రెవెన్యూ పై-5, రీ సర్వే పై-29, ల్యాండ్ గ్రాబింగ్ పై -1, ఫాం 22ఎ పై -0, ఆర్ ఓ ఆర్ పై -158, ఇతర విషయాలకు సంబంధించి 99 వచ్చాయని తెలిపారు. ఈరోజు వచ్చిన అర్జీలలో 155 అర్జీల సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించడం జరిగిందని మిగిలిన అర్జీల సమస్యలను కాల పరిమితి లోపల సంబందిత అధికారులు పరిష్కరిస్తారని జిల్లా కలెక్టర్ తెలిపారు.
Tags tirupathi
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …