-జిల్లాలో మధ్యాహ్న భోజన పథకాన్ని అందుకొనున్న 5425 మంది విద్యార్థినీ విద్యార్థులు
-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 15 జూనియర్ కళాశాల లో శనివారం జనవరి 4 నుంచి మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలియచేసారు.
జిల్లా వ్యాప్తంగా అన్నీ ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాల లో కూడా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టరు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న. 5,425 మంది విద్యార్థినీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు. జనవరి 4 వ స్థానికంగా ఉన్న శాసన సభ్యులు సమక్షంలో ఇంటర్ మీడియేట్ విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకాన్ని ఘనంగా ప్రారంభించడానికి చురుగ్గా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టరు తెలిపారు. జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలులో భాగంగా 12 కాలేజీలను సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులను అనుసంధానం చెయ్యడం జరిగిందనీ తెలిపారు. రాజమహేంద్రవరం జూనియర్ కళాశాల కు, ధవళేశ్వరం జెడ్పీ హై స్కూల్ ఆవరణలో ఉన్న జూనియర్ కళాశాల కు , రంగంపేట జెడ్పీ హై స్కూల్ ఆవరణలో ఉన్న జూనియర్ కళాశాల కు ఇస్కాన్ సంస్ధ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయటం జరుగుతుందని వెల్లడించారు.
పకడ్బందీగా జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయటం కోసం జిల్లా పాఠశాల విద్యా అధికారితో సంబంధిత జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సమన్వయం చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. సంబంధించిన జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తో సమన్వయం చేసుకోవడం, వండిన ఆహార పదార్దాలను ఆయా జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేయడం లో స్థానికంగా ఏర్పాట్లు చేసుకోవడం పై దిశా నిర్దేశనం చెయ్యడం జరిగిందని కలెక్టర్ పి ప్రశాంతి తెలియా చేశారు. ఈ మేరకు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జే వి వి సుబ్రహ్మణ్యం, జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు కు కలక్టర్ సూచనలను ఇవ్వడం జరిగింది.