-రాష్ట్రంలో 65 శాతం ఉచిత ఇసుకను జిల్లా నుంచి అందించాం.
-మార్చి మొదటి వారం నాటికి మరో 58 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు
-పల్లె పండుగ కార్యక్రమం ద్వారా చేపట్టిన పనులు సంక్రాంతి నాటికి పూర్తి చేస్తాం.
-జిల్లాలో 2 లక్షల 52 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేసి రు. 580 కోట్లు రైతులు అందజేశాం.
-జిల్లాలో 531 కి.మీ. లక్ష్యానికి గాను ఇప్పటివరకు 187 కి.మీ. గుంతలను పూడ్చాం.
-జిల్లాలో చేపట్టి అమలు చేస్తున్న ప్రగతి లక్ష్యాలను వివరించిన..
-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న ఉచిత ఇసుకను జిల్లాలో 15 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయటం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు.
గురువారం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ పి.ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తో కలిసి పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానాన్ని మరింతగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా డీసెల్ టేషన్, పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆ మేరకు సెమిమెకానిక్ విధానం ద్వారా 52.82 లక్షల మెట్రికా టన్నుల లక్ష్యంగా ముందు కెళుతున్నామన్నారు. పబ్లిక్ హియరింగ్ అనంతరం మార్చి మొదటి వారంలో అందుబాటులొ కి తేనున్నామన్నారు. రాష్ట్రంలో సరఫరా అయ్యే వాటిలో జిల్లా నుంచి 65 శాతం సరఫరా అవుతోందన్నారు. ఇసుక సరఫరా ఏజెన్సీలు కాల పరిమితి ముగిసిందని, నూతన ఏజెన్సీలు వస్తే మరింత ఇసుక లభ్యత అందుబాటులో ఉంటుందన్నారు.
ధాన్యం కొనుగోలు..
ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి జిల్లాలో 2 లక్షల 52 వేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసిరు. రూ.580 కోట్లు రైతులు ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న 146 ఎఫ్.పి షాపులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందన్నారు. ఈ షాపులను రోస్టర్ ప్రకారం,రిజర్వేషన్ ప్రాతిపదికలపై అందజేయడం జరుగుతుందన్నారు.
రోడ్లు భవనాలు శాఖ ద్వారా
ఆర్ అండ్ బి రహదారులకు గుంతలు పూడ్చే ప్రక్రియలో భాగంగా జిల్లాలో 531 కిలోమీటర్ల లక్ష్యానికి గాను ఇప్పటివరకు 187 కిలోమీటర్లు పూర్తి చేయటం జరిగిందన్నారు. మిగిలిన మూడు వారాల్లో పూర్తి చేయడం జరుగుతుందన్నారు.
ఎన్ఆర్ఈజీఎస్
జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్ క్రింద పల్లె పండుగ కార్యక్రమం ద్వారా సీసీ రోడ్స్, డ్రైన్స్ కు అత్యంత ప్రాధాన్యతనిస్తూ జిల్లాలో ఎన్ టైటిల్మెంట్ రు.88 కోట్లు కు గాను మరింత వేగవంతంగా పనులు పూర్తయ్యేందుకు రు. 142 కోట్ల రూపాయల మంజూరు చేయగా 50 శాతం పనులు పూర్తయ్యాయి అన్నారు. పల్లె పండుగ లక్ష్యాలను సంక్రాంతి నాటికి పూర్తి చేయడం జరుగుతుందన్నారు.
రు. లక్ష రూపాయలు మాత్రమే డ్రైన్స్ నిర్మాణం చేపట్టాలని విషయానికి గాను, రు. 10 లక్షల రూపాయలతో చేపట్టే డ్రైన్స్ కు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. జిల్లాలో స్వయం సహాయక సంఘ గ్రూపులు ఆర్థికంగా శక్తివంతంగా ఉన్నాయన్నారు. జిల్లాలో డయిరీ యూనిట్స్, ఎస్ హెచ్ జి, పౌల్ట్రీ, పీఎంఈజీపి అభివృద్ధి చేయడం ద్వారా ఎస్ హెచ్ జి గ్రూప్స్ మరింత ఆర్థికంగా బలోపేతం చెందుతాయన్నారు.
జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ ఇంటింటి సర్వే ప్రారంభించామన్నారు. దీని ద్వారా వారి ఆర్థిక స్థితిగతులు మరింత మెరుగుపడతాయి అన్నారు.
రీ సర్వేలో భాగంగా జిల్లాలో 272 రెవెన్యూ గ్రామాలకు గాను 190 గ్రామాల్లో ఈ సర్వే పూర్తయిందన్నారు.
రీ సర్వేలో భాగంగా మిగిలిన 72 గ్రామాల్లో మండలంలో ఒక గ్రామాన్ని తీసుకొని ఈ సర్వే ప్రక్రియను పూర్తి చేయడం జరుగుతుందన్నారు.
ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కింద జిల్లాలో 170 పెన్షన్లు ఆరోగ్య సంబంధిత పెన్షన్లుగా అందించి రాష్ట్రంలో ప్రధముగా నిలిచామన్నారు. జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రభుత్వ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని అమలు చేస్తున్నామన్నారు. అర్బన్ లో రానున్న పుష్కరాలు దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాల్ని చేపడుతున్నట్లు చెప్పారు.
జిల్లాలో 286 చోట్ల రెవిన్యూ సదస్సు షెడ్యూలు వెయ్యడం జరిగిందని, ఇప్పటి వరకు 230 గ్రామాలలో చేపట్టిన సదస్సు లలో 2903 అర్జీలను స్వీకరించడం జరిగిందన్నారు. వాటిలో 1041 పరిష్కరించునట్లు తెలిపారు. ఆర్ వో ఆర్ 865 , రీ సర్వే 726. పౌర సేవలు 670 , ఇతరములు 269 అభ్యర్థనలు ఉన్నాయన్నారు. 272 రెవెన్యు గ్రామాలలో ఇప్పటి వరకు 190 రెవిన్యూ గ్రామాల్లో సర్వే పూర్తీ చేశాం.
పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఉపాధిహామీ పథకం కింద 666 సీసీ రోడ్డు పనులకు 131 కి మి లకు రూ.65 కోట్ల 63 లక్షల అంచనాతో మంజూరు చేయడం జరిగింది
రూ .33 కోట్ల 17 లక్షల తో 320 పనులు పూర్తి చేశాం. మరో 320 పనులు పురోగతి లో ఉన్నాయి.
జిల్లాలో మినీ గోకులం క్యాటిల్ షేడ్స్ 678 చేపట్టగా వాటికీ రూ.1559 లక్షల 40 వేల తో మంజూరు చేయడం జరిగింది. 234 పనులు పూర్తి కాగా, 429 పనులు పురోగతిలో ఉన్నాయి.
హర్టికల్చర్ 381 రైతులకి చెందిన 652 హెక్టార్ల లో 47,877మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కెనాల్ బండ్ పై 381 పనులు చేపట్టడం, 27507 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
జిల్లాలో ఎం ఎస్ ఎం ఎస్ సర్వే జరుగుతుందని, ఇది మేజర్ ఇండస్ట్రీస్ తో టై అప్ అయి ఉంటాయన్నారు. జిల్లాలో కార్పెంటరీ క్లస్టర్ ఏర్పాటు త్వరలో ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు.
పరిశ్రమల అభివృద్ధిలో భాగంగా కలవచర్ల లేఔట్ ప్రారంభమైందని దానికి సంబంధించి అప్రోచ్ రోడ్లు అందుబాటులోకి తెస్తామన్నారు.
పోలవరం జీలుగుమిల్లి జాతీయ రహదారి ఏర్పాటుకు ప్రతిపాదన సిద్ధమయ్యే అన్నారు. అదేవిధంగా కొవ్వూరు పట్టిసీమ గోదావరి బండ్ రహదారి అభివృద్ధికి త్వరలో భూసేకరణ చేపట్టే దిశగా చర్య చేపట్టనున్నామన్నారు. బొబ్బిలంక ధవలేశ్వరం హేమగిరి రహదారికి అంచనాలు రూపొందించడం జరిగిందని ఇందుకు పార్లమెంట్ సభ్యులు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని సుమారురు. 120 కోట్లు అవసరం కానున్నాయన్నారు. ఇప్పటికే ఏడిపి పిఆర్ రోడ్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. స్మశాన వాటికకు అవసరమైన పనులను ఎన్ఆర్ఈజీఎస్ లో చేపట్టడం జరుగుతుందన్నారు.
ప్రతి అంగన్వాడి కేంద్రంలో, టాయిలెట్స్, ఆర్ఓ ల్యాండ్స్ న్యూట్రి గార్డెన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని పాఠశాలలో వసతి గృహాలు ఖాళీ స్థలాల్లో న్యూట్రి గార్డెన్స్ ఏర్పాటు చేస్తున్న మన్నారు.