-జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ఏర్పాటు
-జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజ్యాంగం ప్రకారం విభిన్న ప్రతిభా వంతులకు సమాజంలో వారి అవ సరాలను తగిన విధంగా మరింత మెరుగ్గా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ప్రధాన న్యా యమూర్తి గంధం సునీత అన్నారు. స్థానిక జియోన్ బ్లైండ్ పాఠశాలలో లాటరీ క్లబ్ ప్రెసిడెంట్ తోట సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యా యమూర్తి గంధం సునీత పాల్గొని విద్యార్థులకు 60 మంది విభిన్న ప్రతిభావంతుల విద్యార్థుల కు దుప్పట్లు, తల దిండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా జడ్జి గంధం సునీత మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం విభిన్న ప్రతిభా వంతులకు సమాజంలో వారి అవసరాల ను తగిన విధంగా మరింత మెరుగ్గా మౌలిక సదుపాయాలు తీర్చాలని లక్ష్యంతో హైకోర్టు చీఫ్ జస్టిస్ వారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారన్నారు. అందులో భా గంగానే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ఉమ్మడి జిల్లాలోని కాకి నాడ, డాక్టర్ బి.ఆర్ అం బేద్కర్ కోనసీమ, తూర్పుగో దావరి, అల్లూరి సీతారామ రాజు జిల్లాల పరిధిలోగల విభిన్న ప్రతిభావంతులు ఉం డే పాఠ శాలలను, సంస్థలను డీఎల్ఎస్ ఏ సెక్రటరీ, సంబంధి త ఇతర జ్యుడీ షియల్ అధికారులతో సందర్శించి వారికి అవసరమయ్యే సర్జరీ పరిక రా లు ఇతర ఎక్విప్మెంట్ సంబం ధించి నివేదికను హైకోర్టు వారి కి అందజేయడం జరిగింద న్నారు. అందులో భాగంగానే నేడు దాతలు సహకారంతో గతంలో లోటరీ క్లబ్ ఆధ్వ ర్యంలో ప్రియదర్శిని ఆశ్రమాన్ని సందర్శించి దుప్పట్లు, తలదిం డ్లు, విభన్న ప్రతిభావంతుల విద్యార్థులకు అందజేసామ న్నారు మన్నారు.
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వారు అవసరమైన కళ్లద్దాలను అందిస్తా మని ముందుకు రావడం జరిగింద న్నారు. చిన్న చిన్న ఆపరేషన్లకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేస్తా రని తెలిపారు. సామాజిక బా ధ్యతతో రోటరీ క్లబ్ విభిన్న ప్రతి భావంతుల విద్యార్థులకు వారి అవసరాలు మేరకు బ్లాం కెట్స్, పిల్లోస్, మ్యాట్స్ ను అం దజేశారని వారికి ధన్యవాదా లు తెలియజేస్తు న్నామన్నారు.
సమాజంలో మా వంతు సేవ ను చేసేందుకు హైకోర్టు వారు ఈ అవకాశాన్ని కల్పించి నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నా రు.
సమాజంలో భాగమైన విభిన్న ప్రతిభావంతుల అవసరాలు తీర్చేందుకు దాతలు పెద్ద మనసుతో ముందుకు వచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా వారికి భవి ష్యత్తులో ఈ విద్యార్థులకు మంచి జీవితం ఉంటుందన్నారు.
గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశా లు ప్రకారం, హైకోర్టు గౌరవ చీ ఫ్ జస్టిస్ వారి సూచనల మేర కు శారీరక సామర్ధ్యము లోపం తో ఉన్న చెవిటి మూగ, ఇతర అంగ వైకల్యాలతో బాధపడే పిల్లలకి బోధన చేస్తున్న పాఠశాలలను, సంస్థలను పర్యవేక్షిం చడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు.
ప్రత్యేక అవసరాల గల పిల్లలని గుర్తించి వారికి పరీక్షలు చేయించడం, ఆ మేరకు అవసరమైనా శస్త్ర చికిత్సలు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.. ఇదే క్రమంలో గత వారం ప్రియదర్శిని సంస్థను సందర్శించి వైద్య పరీక్షలు చేయించినట్లు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించే క్రమంలో చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.ప్రకాష్ బాబు, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తోట సుబ్బారావు, హెడ్ మాస్టర్, జి. జాన్ మోసెస్, సామాజిక వ్యక్త, యోగా గురు, గాలి సర్వేశ్వరరావు, ఆర్యాపురం కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్, పడాల శ్రీనివాస్, ప్రముఖ పారిశ్రామిక వేత్త, వంగల వెంకట అప్పారా వు, ఈ గిల్స్ స్కూల్ ఎండి, దొమ్మేటి పద్మ కుమారి, తదితరులు పాల్గొన్నారు.