Breaking News

జాతీయ వాలీబాల్ పోటీలు విజయవంతం చేయండి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 6 నుంచి 10 వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్,ఉమ్మడి కృష్ణా జిల్లా అండర్ 19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సంయుక్తంగా నగరంలో నిర్వహిస్తున్న 68 వ అండర్ 19 బాలికల స్కూల్ గేమ్స్ జాతీయ వాలీబాల్ పోటీలు విజయ వంతం గా నిర్వ హించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం లక్ష్మి నరసింహారావు కోరారు.గురువారం పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాతీయ వాలీబాల్ పోటీల నిర్వహణ కమిటీల సమావేశం జరిగింది.ఈ సమావేశం లో ఆయన మాట్లాడుతూ పోటీలు స్థానిక పి . బి సిద్ధార్థ కళాశాల మైదానం లో జరుగుతాయని ,పోటీల్లో పాల్గొనే క్రీడాకారిణి లతో సోదర భావం తో మెలగాలని,వాళ్ళకి కుటుంబ వాతావరణం కల్పించి వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. రాష్ట్ర స్కూల్ గేమ్స్ కార్యదర్శి జి.భానుమూర్తి రాజు మాట్లాడుతూ ఈ జాతీయపోటీల్లో 26 రాష్ట్రాల బాలికల జట్లు పొల్గొంటున్నాయని చెప్పారు.అన్ని రాష్ట్రాల జట్టుకు స్థానిక హోటల్ లలో ఉచిత బస ఏర్పాటు చేస్తున్నామని వారికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పూర్తి రక్షణ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేవారు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా రైల్వే స్టేషన్,బస్ స్టాండ్ లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. పోటీలు జిల్లా కలెక్టర్ లక్ష్మి షా, పార్లమెంటు సభ్యుడు కేశినేని చిన్ని,లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని అన్ని ఏర్పాట్లు పరిశీలిస్తున్నారని తెలిపారు.జిల్లా కార్యదర్శి వి. రవికాంత మాట్లాడుతూ పోటీలకు 4 కోర్టులను ఏర్పాటు చేస్తున్నామని,అందులో రెండు ఫ్లడ్ లైట్ల ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.పోటీలు తికించడానికి వచ్చే ప్రేక్షకులకు కోసం గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.పోటీలు లీగ్ కమ్ నాక్ అవుట్ పద్ధతిలో జరుగుతాయని,ప్రతి రోజూ ఉదయం 8 నుంచి 12 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 నుంచి 10 గంటల వరకు పోటీలు జరుగుతాయని వివరించారు. ఈ సమావేశం లో రాష్ట్ర స్కూల్ గేమ్స్ సంయుక్త కార్యదర్శి కె.వి.రాధా కృష్ణ, ఎ.పి.రాజు ,వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *