-హోమ్ ట్రై యాంగిల్ ప్లాట్ ఫామ్ సదవకాశం కలుగ చేస్తాం
-కమిషనరు కేతన్ గార్గ్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్ధ రాజమహేంద్రవరం పరిధిలో ప్లంబర్ లు, కార్పెంటర్ లు, ఎలక్ట్రీషియన్ లు,ఏ సి రిపేరు మరియు ఇన్స్టాలేషన్, గీసర్ రిపేరు, టి.వి రిపేరు మరియు ఇన్స్టాలేషన్,రిఫ్రిజిరేటర్ రిపేరు, వాషింగ్ మెషీన్ రిపేరు చేసేవారు, బ్యూటీషియన్,సెలూన్ సర్వీసెస్ (పురుషులు మరియు స్తీలు) మొ.. సేవలు అందించే వారికి నైపుణ్య అభివృద్ధి శిక్షణ సంస్ధ ద్వారా శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ అందజేయడం జరుగుతుందని నగర పాలక సంస్థ కమిషనరు కేతన్ గార్గ్ గురువారం ఒక ప్రకటనలో తెలియచేసారు. నైపుణ్యం కలిగి, అర్హత పొందిన వారికి హోమ్ ట్రై యాంగిల్ ప్లాట్ ఫామ్ ద్వారా వీరిని ONBOARD చేయుట ద్వారా జీవవనోపాధి కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలియచేసారు.
కావున పైన తెలిపిన సేవలు అందించే ఆసక్తి కలిగిన వారు 03-01-2025 నుండి 06-01-2025 వరకు మెప్మా కార్యాలయం, నగరపాలక సంస్ధ రాజమహేంద్రవరం నందు మీ వివరములు నమోదు చేసుకొన వలసినదిగా కోరడమైనది. వివరములు కొరకు 8008618325, 9391050195 లలో సంప్రదించవచ్చునని తెలియచేసారు.
ఆసక్తికలవారు 1) రేషన్ కార్డ్ జిరాక్స్ 2) ఆధార్ కార్డ్ జిరాక్స్ 3) బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ 4) పాన్ కార్డ్ జిరాక్స్ 5) యూనియన్ ఐడి కార్డ్ జిరాక్స్ 6) మీ కుటుంబం లో ఆడవారు ఎవరైనా డ్వాక్రా స్వయం సహాయక సంఘాల గ్రూప్ లో ఉంటే వారి సంఘం పేరు జతపరచి రిజిష్టరు చేసుకొనవచ్చుననీ కేతన గార్గ్ పేర్కొన్నారు.