అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సీనియర్ జర్నలిస్ట్ అప్పరుసు కృష్ణారావు మాజీ ప్రధానమంత్రి పీ.వీ.నరసింహారావు దేశానికి చేసిన సేవలు, ఆయన రాజకీయ జీవితం గురించి తెలిసేలా రచించిన ‘పాములపర్తి వెంకట నరసింహారావు’ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు కి అందించారు. సమకాలీన చరిత్రలో చెప్పుకోదగ్గ రాజకీయ నేత, ఆర్థిక సంస్కర్త అయిన పీవీ నరసింహారావు 18 భాషలు తెలిసిన మేధావి అని, ఆయన గురించి ఈ తరం తెలుసుకునేలా సరళమైన భాషలో సంక్షిప్తంగా రాశారంటూ అప్పరుసు కృష్ణారావు ని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు. ఈ పుస్తకం గురువారం నుంచి విజయవాడలో ప్రారంభం కానున్న పుస్తక మహోత్సవం కార్యక్రమంలో విడుదల కానుంది. సీఎంకు పుస్తకం అందజేసిన వారిలో అప్పరుసు కృష్ణారావుతో పాటు సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు ఉన్నారు.
Tags amaravathi
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …