-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పిలుపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో కలిసి పనిచేద్దామని ఉద్యోగులకు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితను కలిసి పలు ఉద్యోగ సంఘ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, గాడి తప్పిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించడానికి సీఎం చంద్రబాబునాయుడు రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగులు తీవ్ర వేధింపులకు గురయ్యారన్నారు. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు సైతం అందలేదన్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి, జైలు పాలు చేశారన్నారు. చివరికి జీతాలు, పెన్షన్లు సైతం సకాలంలో వచ్చిన సందర్బంలేదన్నారు. ఇటువంటి సమయంలో సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఉద్యోగులు అండగా నిలిచారన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకున్నారన్నారు. ప్రస్తుతం గాడి తప్పిన రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి సీఎం చంద్రబాబునాయుడు రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. ఆయనకు అండగా నిలిచి, రాష్ట్రాభివృద్ధికి ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అమరావతి జేఏసీ ప్రతినిధులు బొప్పరాజు వెంకటేశ్వరరావు, ఇతర ఉద్యోగ సంఘ నాయకులు, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి శుభాకాంక్షల వెల్లువ
నూతన సవంత్సరం సందర్బంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు వెలగపూడిలో రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకటి వెంకటగురుమూర్తి, ఆర్యవైశ్య కార్పొరేషన్ డూండి రాకేశ్, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, చేనేత, జౌళిశాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, కమిషనర్ రేఖారాణి, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లికార్జున, ఇతర అధికారులు పాల్గొన్నారు.