Breaking News

రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను సచివాలయంలో కలిసిన పలువురు ఎన్ ఆర్ ఐ లు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వివిధ దేశాల్లో ఉన్న ఎన్ ఆర్ ఐ లను ప్రవాసాంధ్ర తెలుగు సంఘం (ఎ పి ఎన్ ఆర్ టి) లో భాగస్వామ్యులను చేయడం ద్వారా, ప్రవాసాంధ్ర తెలుగు సంఘం ఆధ్వర్యంలో అందించే సౌకర్యాల గురించి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఎన్ ఆర్ ఐ విభాగం కోఆర్డినేటర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో అమెరికా, ఆస్ట్రేలియా, పోలాండ్, యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చిన దాదాపు ఇరవై మంది ప్రవాసాంధ్రులు మంత్రిని కలిశారు. వారితో జరిగిన ఇష్టాగోష్టిలో మంత్రి మాట్లాడుతూ ఎక్కువమందిని ఎ పి ఎన్ ఆర్ టి లో భాగస్వాములు చేయడం ద్వారా ప్రవాసాంధ్రుల సమస్యలను పరిష్కరించేందుకు, సంబంధాలు మెరుగుపరిచేందుకే ఈ మంత్రిత్వ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని తెలిపారు. అన్ని దేశాల తెలుగు సంస్థలను, వివిధ దేశాలలో నివసించే ప్రవాసాంధ్రుల పరిస్థితులను కష్టనష్టాలను ప్రతినిధులను కలుపుతూ ఒక సమూహం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ప్రతి జిల్లాలోనూ కలెక్టరేటుకు అనుబంధంగా ఎన్నారైలకు సహకారం అందించేందుకు ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి, ప్రభుత్వం తరఫున అధికారులను నియమించే ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మంత్రిని కలిసిన వివిధ దేశాల వారు విన్నవించిన సమస్యలను విని మంత్రి సానుకూలంగా స్పందించారు.

ఇదే సమయంలో పోలాండ్ జాతీయురాలైన టైక్వాండో ప్రపంచ క్రీడాకారిణి (ఈమె 5 ఒలంపిక్ మెడల్స్ ను, రెండు ప్రపంచ మెడల్స్ సాధించి అంతర్జాతీయ స్థాయిలో 9వ ర్యాంకు క్రీడాకారిణిగా ఉన్నారు) పెట్రూష, ఉత్తరభారత దేశానికి చెందిన టైక్వాండో క్రీడాకారుడు శివం (ఈయన భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న టైక్వాండో క్రీడాకారుడు) మంత్రి శ్రీనివాస్ ను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతిలో టైక్వాండో అంతర్జాతీయ క్రీడ విభాగాన్ని ఏర్పాటు చేస్తే తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని, 2028 లో జరిగే ఒలిపిక్స్ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ కు అంతర్జాతీయ టైక్వాండో క్రీడాకారులను తయారు చేయడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారు మంత్రికి హామీ ఇచ్చారు. ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించి టైక్వాండో అంతర్జాతీయ క్రీడా విభాగం ఏర్పాటు చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *