రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పేపరు మిల్లు కార్మికుల వేతన సవరణ విషయంపై నెలకొన్న సమస్యను చర్చిందేందుకు ప్రజాప్రతినిధులు శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఈమేరకు ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సీఎంతో అపాయింట్ మెంట్ తీసుకున్నారు. మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ లతో కల్సి ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎంపీ సమావేశం కానున్నారు. డిసెంబరు 24న కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో కార్మిక శాఖ జాయింట్ లేబర్ కమిషనర్ అధ్వర్యంలో ప్రజాప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పేపరు మిల్లు యాజమాన్యం, కార్మికుల తో 2020, 2023 వేతన సవరణ విషయం పై సమావేశం నిర్వహించిన సంగతి తెల్సిందే. ఈసందర్బంగా వేతన సవరణ పరిష్కారం లభించక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్తామని ఎంపీ పురందేశ్వరి ప్రకటించారు. దీంతో శుక్రవారం ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు.
Tags rajamandri
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …